Suryaa.co.in

Andhra Pradesh

ఏసీబీ వలలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్‌!

ఒంగోలు: ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్‌గా కేఎస్ శ్రీనివాస ప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శ్రీనివాస ప్రసాద్.. సిహెచ్ శ్రీధర్ కు చెందిన ట్రేడ్ కంపెనీకి నోటీసు ఇచ్చి దానిపై పెనాల్టీ వేశారు. ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. సిహెచ్ శ్రీధర్ నుంచి శ్రీనివాస ప్రసాద్‌ లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డిఎస్పీ పి.రామచంద్రరావు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. నిందితుని వద్ద నుండి లక్షా యాభై వేల రూపాయలు లంచం డబ్బులు రికవరీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీ శేషు, ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్.మస్తాన్ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE