Suryaa.co.in

Andhra Pradesh

ఫిరంగిపురంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గం

– జనసేన బిజెపి కలిసే ఉన్నాం
పవన్ తో పొత్తులో ఉన్నాం కాబట్టే మా ఆద్యక్షుడ్ని పవన్ కలిశారు
– బిజెపి ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు

పురాతన మందిరాలపై ఈ ప్రభుత్వం లో ఎందుకు దఫ‌దఫాలుగా ఈ చర్యలు జరుగుతున్నాయి… రామతీర్ధం, అంతర్వేది రధం దగ్ధం, దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల చోరీతో పాటు పలు ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.రాష్ట్రంలో హైందవ ధర్మాన్ని అపహాస్యం చేస్తుంది …. రాష్ట్రంలో ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు ..ఒక్కరినీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?

విగ్రహాలు ద్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయమని అడిగితే మాపై అక్రమ కేసులు బనాయించారు… ఫిరంగిపురం వినాయకుని విగ్రహం ధ్వంసం లో కుట్ర దాగి ఉంది.విగ్రహ ధ్వంసం ఘటనలో నిందితులను అరెస్ట్ చేయకుంటే కపిలతీర్దం నుంచి రామతీర్దం దాకా యాత్ర‌చేపడతాం. బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నా. ఇది ముమ్మాటికి బిఆర్ ఎస్ ప్రభుత్వ పిరికిపంద చర్య. ఇటువంటి చర్యలకు బిజెపి భయపడదు. పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ లో అధ్యక్షుడి పాత్ర అనేది కుట్ర. గతంలో ఇలానే కుట్రలు పన్ని ఉస్ ఖాకి అయిపోయారు.

మోదీ ని ఎదుర్కొనేందుకు డబ్బు సంపాదించాలనే కెసిఆర్ ఇడువంటి కుట్రలు పన్నుతున్నారు. బిఆర్ ఎస్ కుట్రలకు బిజెపి భయపడదు. జనసేన బిజెపి కలిసే ఉన్నాం. పవన్ తో పొత్తులో ఉన్నాం కాబట్టే మా ఆద్యక్షుడ్ని పవన్ కలిశారు. మేం ఇద్దరం కలిసి వైసిపి ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు కలిసి ఉద్యమిస్తాం. చంద్రబాబు ను కలిసినంత మాత్రాన పొత్తులో ఉన్నారంటే ఎలా? ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఫైట్ చేస్తాం. జగ్జీవన్ రాం మన దేశానికి ఆదర్శ్ పురుషుడు. రైతులను ఆదుకోవడానికి ఆయన చేసిన సేవలు నేటి కి మరువలేనివి అన్నారు.

LEAVE A RESPONSE