జగన్ పాలనలో తిరోగమనం… కూటమి హయాంలో పురోగమనం!
– నాడు విదేశాలకు మనీ లాండరింగ్…
– నేడు విదేశాల నుంచి క్వాంటం కంపెనీలు వస్తున్నాయ్..
– మారనున్న ఏపీ ముఖచిత్రం
– ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్
మంగళగిరి: నాడు విదేశాలకు మనీ లాండరింగ్ దుస్థితి నెలకొంటే, నేడు విదేశాల నుంచి క్వాంటం కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయని, దీని ఫలితంగా రాష్ట్ర ముఖచిత్రం మారబోతుందని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు అమరావతి క్వాంటం వ్యాలీకి క్యూ కడుతున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించింది. ఐబీఎం, టీసీఎస్ ల భాగస్వామ్యంతో ప్రారంభమైన అమరావతి క్వాంటం వ్యాలీ ప్రస్థానం మైక్రో సాప్ట్ రావడంతో 100 రేట్లు పెరిగింది. ఏపీకి రాజధాని అనేది లేకుండా చేసిన జగన్ రెడ్డి.. ఆ తరువాత ఏడాదిలోనే అమరావతి రాజధాని పనులు జరుగుతున్న నేపథ్యంలో మైక్రో సాప్ట్ లాంటి కంపెనీ పెట్టుబడి పెడతామని చెప్పడం హర్షనీయం. మైక్రో సాప్ట్ లాంటి కంపెనీలు అమరావతికి వస్తున్నాయంటే మిగతా కంపెనీలు క్యూ కడతాయి. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం క్వాంటం కంప్యూటింగ్ మిషన్ అనేది ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని.. దానికి రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఎక్కడ వినిపించలేదు.. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు దేశంలోని పలు నగరాలు పోటీగా కాకుండా వాటిని భయపెట్టే స్థితిలో ముందుకు సాగుతోంది.
గత ప్రభుత్వం అసలు క్వాంటం వ్యాలీని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి అసలు అడిగిన పాపాన కూడా పోలేదు. ఎన్నికలు అయిన తరువాత 4 టెక్నాలజీ హబ్ లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఒక్క 17 సంస్థలను, 17 ప్రతిపాదనలను ఎంపిక చేశారు. 4 టెక్నాలజీ హబ్ లో కానీ, 387 దరఖాస్తు చేసుకున్న కంపెనీల్లో కానీ, 17 ప్రతిపాదనల్లో కానీ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ పేరు లేదు. దేశవ్యాప్తంగా 43 సంస్థలు, 152 మంది పరిశోధకులతో నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే అందులో ఆంధ్రప్రదేశ్ లేదు.. 2024 సెప్టెంబర్ 30లో కనీసం పరిగణలో కూడా లేని ఆంధ్రప్రదేశ్.. నేడు దేశంలోనే నెంబర్ 1 క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ గా ఎదిగి.. విదేశాలకు చెందిన పెద్దపెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.
తెలంగాణ కూడా విదేశీ కంపెనీతో కలిసి భాగస్వామ్యం ఏర్పచుకుంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాతే క్వాంటం కంప్యూటింగ్ లోకి ఆంధ్ర ప్రదేశ్ వచ్చింది. అంతకుముందు ఆంధ్రలో ఎవరు పట్టించుకోలేదు.. కనీసం దాని గురించి ఎవరు మాట్లాడింది లేదు.. కేంద్ర ప్రభుత్వం కూడా మొదట రిసెర్చ్ చేయాలని భావించింది. 2019 – 2024 మధ్య 100 మెట్లు వెనుక ఉంది.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 10 మెట్లు ముందే ఉంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రిసెర్చ్ మీరు చేస్తున్నారు కదా.. ఆ క్వాంటం కంప్యూటింగ్ ఏదో ఇక్కడికే తెచ్చి పెడితే సరిపోతుంది కదా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఐబీఎం, టీసీఎస్ లను ఒప్పించి మేం మీకు అండగా ఉంటాం.. మీకు ఏమి కావాలన్న ఇస్తాం.. ల్యాండ్, బిల్డింగ్ ఏర్పాటు చేస్తాం.. అమరావతిలో పెట్టండి అంటే మన విజన్ వాళ్లకు నచ్చి మొదటి క్యాంటం వ్యాలీ.. అమరావతి క్వాంటం వ్యాలీలో పెట్టించాం. ఏదో నాలుగు మాటల్లో చెప్పేస్తున్న కానీ, వారిని ఒప్పించి అమరావతిలో క్వాంటం వ్యాలీని పెట్టించడం అనేది అంతా సులువు అయిన పని కాదు. మొదటి నుంచి చంద్రబాబు క్వాంటం వ్యాలీని కమర్షీయల్ గా మార్చి దాని ఉపయోగాన్ని మన రాష్ట్రానికి అనువాయించుకోవాలి.. అ రంగానికి చెందిన కంపెనీలను రాష్ట్రంలోకి ఎలా తీసుకోవాలి.. వాటి ద్వారా వ్యాపార అవకాశాలు.. ఉద్యోగ అవకాశాలు ఎలా సృష్టించాలి ఈ విజన్ తో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు.
ఐబీఎం, టీసీఎస్ లు అయితే ముందుకు వచ్చాయి సరే కానీ, మైక్రోసాప్ట్ ఎందుకు ముందుకు వచ్చిందంటే పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు వచ్చింది. హైదరాబాద్ వంటి నగరంలో ఏమి లేని ఖాళీ స్థలంలో హైటెక్ సిటీని కట్టి పర్యావరణ వ్యవస్థను సృష్టించారు. అ తరువాత వచ్చిందే మైక్రోసాప్ట్.. ఆ తరువాత కంపెనీలు అన్ని క్యూ కట్టాయి. ఇప్పుడు హైటెక్ సిటీ వెనుక కొన్ని వేల బిల్డింగులు వచ్చాయి ఇప్పుడు.. అలాంటి పరిస్థితినే నేడు అమరావతిలో రూపొందిస్తున్నారు. హైదరాబాద్ లో ఇంతకుముందు చేశారు.. ఇప్పుడు కూడా చేస్తారనే నమ్మకంతో ఐబీఎం, మైక్రోసాప్ట్ ముందుకు వచ్చాయి. ఆంధ్ర తన అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ ఐబీఎం క్వాంటం సిస్టం – 2ను స్థాపించనుంది.
ఇది రాష్ట్ర, దేశం కాదు… అసియాలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని 2026 జనవరి 1 అమరావతిలో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు క్వాంటం వ్యాలీ అనేది కల కాదు.. అది ఒక విప్లవం.. అమరావతి క్వాంటం వ్యాలీని కేంద్ర బిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారు.