Suryaa.co.in

Andhra Pradesh

చంద్రన్నతోనే బీసీల అభివృద్ధి

-టీడీపీని గెలిపించుకునే వరకు విశ్రమించబోం
-ప్రతి బీసీ గడపకూ వెళ్లి జగన్ రెడ్డి ద్రోహంపై చైతన్యపరుస్తాం
– బీసీ ముఖ్య నేతల సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర

జనాభాలో సగం. ఓట్లలో సగం ఉన్న బీసీలను జగన్ రెడ్డి నాలుగేళ్లుగా దగా చేస్తూ, పీకలు కోస్తూ అణచివేతకు గురి చేస్తున్నాడు. జగన్ రెడ్డి చేస్తున్న దురాగతాలపై ప్రతి బీసీ గుమ్మానికి వెళ్లి ప్రచారం చేసి, జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఈ మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి ఆద్వర్యంలో సీనియర్ బీసీ నాయకులు, బీసీ సాధికార సమితి సభ్యులతో సమావేశమయ్యారు. నాలుగేళ్లుగా నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలను కూడా బీసీలకు అందకుండా చేస్తున్నారు. మరోవైపు దాడులు, దౌర్జన్యాలు, హత్యలు అత్యాచారాలతో బతుకు భారంగా తయారు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రకటించిన మేనిఫెస్టో హామీలను బీసీ వర్గాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో తొలిసారిగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించిందీ, రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి చదువులకు తోడుగా నిలిచింది, ఉద్యోగ ఉపాధితో తోడ్పాటు అందించింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలిస్తేనే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలోని బీసీ వర్గాల అభ్యున్నతి సాకారమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర బిసి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాల్ రావు గౌడ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాతా జయప్రకాశ్, రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ కొండూరు పాల్ శెట్టి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సింహాద్రి, కనకాచారి రజక కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రాజమండ్రి నారాయణ,బిసి జోనల్ ఇంఛార్జులు పుతి కోటేశ్వరరావు, చెల్లుబోయిన శ్రీనివాస్, తమ్మిశెట్టి రమాదేవి, తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్ ఎల్ఐసి నరసింహులు సహా ఇతర బీసీ సాధికార సమితి సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE