దేవినేని అవినాష్ వార్డు వాలంటీర్ కి తక్కువ, గ్రామ వాలంటీర్ కి ఎక్కువ. లోకేష్ గారి గురించి వాలంటీర్ స్థాయి ఉన్న దేవినేని అవినాష్ మాట్లాడటం హాస్యాస్పదం. వెనకటికి ఎవడో పిలిచి పిల్లనిస్తే పెళ్లాడకుండా పారిపోయినట్లు గుడివాడ రాజకీయం చూసుకోరా మగడా అని అవినాష్ కి తెలుగుదేశం బాధ్యతలు అప్పగిస్తే…పారిపోయి వైసీపీలో చేరారు.గుడివాడ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తే తనది మునిసిపల్ కార్పొరేటర్ కన్నా తక్కువ స్థాయి అని తానే ఒప్పుకుని వైసీపీ లో చేరిన వ్యక్తి దేవినేని అవినాష్.
ముఖ్యమంత్రి జగన్ కానీ, దేవినేని అవినాష్ కానీ తప్పులు లేకుండా, ఆపకుండా శుక్లాంబరధరం శ్లోకం చదివితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా!జగన్ కి హిందూ మతం అన్నా, హిందూ దేవుళ్లన్నా భయం. తన మతం వ్యాప్తి కోసమే జగన్ తాపత్రయ పడుతున్నాడు. ఉద్దేశపూర్వకంగానే వినాయక చవితి వేడుకలను అడ్డుకుంటూ, హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని జగన్ దుర్వినియోగ పరుస్తున్నారు.వినాయక చవితి ఒక హిందువుల పండుగ మాత్రమే కాదు. ముస్లింలు, క్రైస్తవులు కూడా వినాయక ఉత్సవాల్లో ఏదో ఒక కళారూపాల్ని ప్రదర్శించుకుంటూ పొట్ట పోసుకుంటారు. వినాయకచవితి వేడుకలకు కోవిడ్ నిబంధనలతో కూడిన అనుమతులను వెంటనే జారీ చేయాలి.