– పోలవరాన్ని ముంచేసి చారిత్రాత్మక తప్పిదం
– సోయలేని రాంబాబు చేతుల్లో జలవనరుల శాఖను పెట్టిన జగన్ రెడ్డి
– పోలవరం ప్రాజెక్టులో జాతి ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి
– మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
పోలవరాన్ని ముంచేసి చారిత్రాత్మక తప్పిదం చేశారు ఇది జాతికి చేసిన ద్రోహం. జగన్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా తట్టుకునే విధంగా పిల్ వే నిర్మాణం చేయబడి ఉంది.ఈ తప్పిదానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా? జలవనురుల శాఖ మంత్రి బాధ్యత తీసుకుంటారా?
కాపర్ డాం ఎగువన నిర్మాణం చేయబడి ఉంది డయా ఫ్రం వాల్ కట్టబడి ఉంది. ECRF డ్యాం పనులు ప్రారంభం చేసే ముందు నిర్వాసితులు అందరిని కూడా గ్రామాలు ఖాళీ చేయించి, ఇళ్ళలోకి పంపి మట్టి కట్ట పనులు ప్రారంభం చేయాలి.2019లో 15 లక్షల క్యూసెక్కుల వరద వెళ్ళింది. 23 లక్షలు 2020లో వెళ్ళింది. ఈరోజు వీళ్లు డబ్బా కబుర్లు చెబుతున్నారు.
ఇవాళ దగ్గర 20 లక్షలు క్యూసెక్కుల వరద వచ్చింది. జూన్ జూలైలో వరద వస్తుందని గోదావరి జిల్లాలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు.జూలైలో ఇంత వరద వస్తుంది అని అనుకోలేదు అనడంతో ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యం ఈరోజు బయటపడింది. ఎగువ కాపర్ డ్యాం పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ? దిగువ కాపర్ డ్యాం నిర్మాణ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ? 37 నెలల నుంచి గడ్డి పీకుతున్నారా?
స్పిల్ వే మీద వెళ్లే నీళ్లు మళ్లీ రివర్స్ లో ఎగువ కాపర్ డ్యాం నుంచి లోపలికి వచ్చేసి రెండు కాపర్ డ్యాంల మధ్యలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తయారయింది.జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, మూర్ఖత్వం వలన వాసు టెండరింగ్ గ్రామాల వలన కమిషన్ల కక్కుర్తికి ఆశపడి పోలవరం డ్యాంతో ఆటలాడుకున్నారు.
ఎనిమిది వందల కోట్లు అవుతాయి నీళ్లు ఎత్తిపోయాలంటే, 2వేల కోట్లు అవుతాయని కాకమ్మ కబుర్లు చెప్పారు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు పెట్టి ఎత్తిపోస్తారు రాంబాబు? నిర్మాణ పనులు చేసే ప్రాంతాన్ని వరద నీటితో ముంచేశారు ఎగువ కాపర్ డ్యాం నిర్మాణ పనులు పూర్తి చేయలేదు 37 నెలలుగా ఏం చేశారు?ముఖ్యమంత్రికి సమీక్ష చేయడానికి కూడా తీరిక దొరకడం లేదు.పోలవరం దేవిపట్నం తదితర మండలాల ప్రజలు, నిర్వాసితులు నానా ఇబ్బందు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తరఫునుండి గానీ జిల్లా యంత్రాంగం గాని మంచినీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు.
వరద సాయం దేవుడి ఎరుగు కనీసం మంచినీళ్లు ఇచ్చే నాధుడే కరువయ్యాడు.వరద ముంపులో ప్రజలుంటే కనీసం అధికార యంత్రాంగం కూడా వాళ్లను సందర్శించలేదు. 37 నెలలుగా జగన్ సర్కార్ మొద్దు నిద్రపోయింది 17వేల నిర్వాసితులను ఇళ్లలోకి మారుస్తున్నామని, బుల్లెట్ దింపుతామన్న మంత్రి బుల్లెట్ కు దొరకకుండా తిరుగుతూ.. బూతులు మాట్లాడుతున్నాడు. వరద సమయంలో కీలకమైన వ్యక్తులని ప్రాజెక్టు దగ్గర పెట్టకుండా, మీ కమిషన్ల కోసం ట్రాన్స్ ఫర్లు, బదిలీల కక్కుర్తి తో పోలవరం ప్రాజెక్టును బలితీసుకున్నారు.
పులిచింతల గేటు కొట్టుకుపోయి ఎన్ని నెలలు అయింది రాంబాబు! గోదావరి నది మీద పులిచింతల ప్రాజెక్టు కడతానన్నాడు… ఇటువంటి సోయలేని రాంబాబు చేతుల్లో జలవనరుల శాఖను పెట్టిన జగన్ రెడ్డి ఎంత తెలివిగలవాడో అర్థమవుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోకుండా డయాఫ్రం వాల్ ని గాలికి వదిలేసారు గోదావరి వరదని కపాడకుండా 2019, 2020 అప్పజెప్పారు.2021 జూన్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు 2022 డిసెంబర్ అన్నారు. మొన్న అసెంబ్లీలో 2023 జూన్ 2023 చివర అంటున్నారు.చంద్రబాబు నాయుడు పోలవరం పనులు 71% పైగా తీసుకువెళ్లారు.
ఒక అసమర్థుడికి ఒక పరిపాలన అవగాహన, అనుభవం లేని వాడికి 151 సీట్లు అప్పజెప్పితే, రాష్ట్రాన్ని నాశనం చేసి, ఐదు లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా ముంచేశాడో 26 జిల్లాలకు వరప్రసాదమైన పోలవరాన్ని ముంచేసాడు. క్రాన్ లాజికల్ ఆర్డర్లో ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, పోలవరం ప్రాజెక్టు లో రాష్ట్ర జలవనరుల శాఖ ఏ విధంగా పనులు చేసిందో చంద్రబాబు నాయుడు కేంద్ర జల వనరుల శాఖకు విపులంగా తెలియచేశారు.
చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిని ప్రశ్నించాడు.. ఆధారం చెప్పాల్సింది ముఖ్యమంత్రి. క్యాబినెట్ మంత్రులు. సజ్జల ఎవరు చెప్పడానికి ! సజ్జల సాక్షిలో గుమస్తా !!
పోలవరం ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి సమాధానం చెప్పాలి.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో జాతి ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు.