Suryaa.co.in

Andhra Pradesh

పవన్ ప్రాణ హానిపై డిజిపి, సజ్జల స్పందించాలి

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య డిమాండ్

‘వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉన్నవారే నన్ను తొలగించటానికి సుపారీ ఇచ్చారని కచ్చితంగా తెలిసింది.’ అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలపై ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు.

బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, సినీ హీరో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం రాష్ట్రంలో అశాంతి భద్రతలకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. గతంలోనూ హైదరాబాదులో పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నాలుగు వైపులా, ఏదో ఒక చోట జరుగుతున్న హత్యలు, దాడులు ఇందుకు ఊతమిస్తున్నాయన్నారు.

వైయస్ వివేకానంద రెడ్డి కేసులో ఇప్పటికే ఆయన కుమార్తె సునీత రెడ్డి, దస్తగిరి తమకు ప్రాణహాని ఉందని బహిరంగంగా వాపోయారని పేర్కొన్నారు. గతంలోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటిపై దాడి, మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం పై దాడి, చంద్రబాబు బహిరంగ సభలపై రాళ్ళ దాడి జరిగాయని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పవన్ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. పవన్ వరాహి యాత్రలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరిగినా, అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే

LEAVE A RESPONSE