– సొంత పార్టీ వారైనా , ఇతర పార్టీల వారైనా రాజకీయంగా తేల్చుకుంటా
– సంగం డైయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర
గుంటూరు: సంగం డెయిరీ చైర్మన్ ఎవరు ఉంటారో వారే ట్రస్టు బాధ్యతలు చూస్తారు.ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నాపై విమర్శలు చేస్తున్నారు.ట్రస్టు ఆస్తులు మేం కాజేసినట్లు మాట్లాడుతున్నారు.ట్రస్టు కార్యకలాపాలు సంగం డెయిరీ పాలకవర్గం నిర్వహిస్తుంది. ధూళిపాళ్ల నరేంద్రగా నేను ట్రస్టు విషయాల్లో ఉండను. సంగం డెయిరీ చైర్మన్ ఎవరు ఉంటే, వాళ్లకే అధికారం ఇస్తూ నిబంధనల్లో మార్పు. డెయిరీ లో పనిచేసి వెళ్లిన వారే ఇప్పుడు పిటిషన్లు వేసి ట్రస్టుని వివాదాల్లోకి లాగారు.ఈ చెట్టు నీడలో పెరిగిన వారే ఇలా చేయటం మాకు బాధగా ఉంది. పిటిషన్ లు వేసేందుకు కొంత వెనక ఉండి ప్రోత్సహిస్తున్నారు. సొంత పార్టీ వారైనా , ఇతర పార్టీల వారైనా రాజకీయంగా తేల్చుకుంటాను. ఎవరైనా నాతో తేల్చుకోండి . ట్రస్ట్ తో రాజకీయాలు వద్దు. సంగం డైయిరీ మీద ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఏసీబీ అధికారులు నేను అక్రమాలకు పాల్పడినట్లు ఒక్క ఆధారం చూపలేకపోయారు. టన్నుల కొద్దీ కాగితాలు చూసినా ఒక్క తప్పు తేల్చలేకపోయారు.