– గోనుగుంట్ల కోటేశ్వరరావు పిలుపు
అమెరికా: ప్రవాసాంధ్రులు జన్మభూమిని మర్చిపోకుండా పేదల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చిన పీ4 కార్యక్రమం లో భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కోరారు.
అమెరికా లో కనెక్ట్ కట్ లో జాష్టి శ్రీకాంత్, రజనీకాంత్, పరుచూరి తరుణయ్య ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కార్యక్రమం లో ప్రవాసాంధ్రులు పాల్గొని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడారు. వేల కిలోమీటర్ల దూరంలో టూ, స్వదేశాన్ని, స్వరాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీ ని మర్చిపోకుండా మీరు చూపిస్తున్న అభిమానం, ఆప్యాయత మరువలేనిదన్నారు.
సంపాదించిన దానిలో కొంత పేదల కోసం ఖర్చు చేసి బంగారు కుటుంబాలను తయారు చేయాలని గోనుగుంట్ల కోటేశ్వరరావు కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు దేశంలో ఎక్కడ లేని విధంగా, పెన్షన్ లు పంపిణి చేస్తోంది… సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ, రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని తెలిపారు. దివ్యాంగులకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చారు. వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు, పది వేలు, పదిహేను వేలు చొప్పున ఇచ్చి ఆదుకుంటున్నారు. భగవంతుడు మనకిచ్చిన శక్తిని, యుక్తిని, సంపదనూ, అధికారాన్ని సమాజ హితానికి ఖర్చుపెట్టాలని కోరారు.
ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా పలు సమస్యలు, సూచనలు గోనుగుంట్ల కోటేశ్వరరావు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విశ్వనాథ్ నాయనిపాటి సభకు అధ్యక్షత వహించారు .మాగంటి ప్రసాద్, రమణయ్య, పరుచూరి చక్రధర్, రావెళ్ల ఉత్తేజ్, శ్రీధర్ అరవపల్లి, తదితరులు పాల్గొన్నారు.