– కే టీ ఆర్ కు సన్నిహితుడైతే రేవంత్ రెడ్డి కేపీసీ ప్రాజెక్టుకు ఎందుకు 400 కోట్ల ప్రాజెక్టు ఎందుకు ఇచ్చారు ?
– ఫీనిక్స్ వాళ్ళు రేవంత్ తో ఇపుడు అంటకాగుతున్నారు
– ఆరోపణలు చేసిన వారికే రేవంత్ కాంట్రాక్టులు
– అపుడు తెలంగాణ ద్రోహి అన్న వారికి ఎందుకు కాంట్రాక్టులు ఇచ్చావో చెప్పు రేవంత్?
– రేవంత్ రెడ్డి పాత స్క్రిప్ట్ ను కవిత తిరగదోడుతున్నారు
– బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: 2023 కన్నా ముందు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు అందరి అటెన్షన్ కోసం రకరకాల అబద్దాలు ఆడారు. వ్యాపారులకు కాంట్రాక్టర్లకు కేసీఆర్ ,కే టీ ఆర్ లతో సంబంధాలను రేవంత్ రెడ్డి అంటగట్టే వారు. తమ బంధువులకు ,తెలంగాణ ద్రోహులకు కే సీఆర్,కే టీ ఆర్ కాంట్రాక్టులు కట్టబెట్టారని రేవంత్ ఆరోపించేవారు. ఈ అంశాలపైనే కొన్ని డజన్ల ప్రెస్ మీట్లు పెట్టారు
ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపించిన వారికే రేవంత్ ఇపుడు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. కేసీ పుల్లయ్య అనే కంపెనీ పొద్దుటూరు వారిది అని అరడజన్ సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ మాధ్యే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ కవిత చదివారు. అంబేద్కర్ విగ్రహం ,అమర జ్యోతి ప్రాజెక్టుల్లో అవినీతి గురించి మాట్లాడారు.
కే సీ పుల్లయ్య ప్రాజెక్టు కే టీ ఆర్ ను కలిశాక కేపీసీ ప్రాజెక్టు గా మారింది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ వ్యూహం ఈ వ్యూహం రచించి రేవంత్ అప్పట్లో తలాతోకా లేకుండా మాట్లాడారు. కే పీ సీ ప్రాజెక్టు అనిల్ కుమార్ శెట్టి రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి తో ఇపుడు సన్నిహితంగా ఉన్నారు.
. కే టీ ఆర్ కు సన్నిహితుడైతే రేవంత్ రెడ్డి కేపీసీ ప్రాజెక్టుకు ఎందుకు 400 కోట్ల ప్రాజెక్టు ఎందుకు ఇచ్చారు ? తిరుపతి రెడ్డి కి దగ్గరైనందుకే కేటీపీఎస్ 400 కోట్ల ప్రాజెక్టు కే పీ సీ కి దక్కిందా ? గతం లో ఫీనిక్స్ కు కేటీఆర్ కు ఉత్తమ్ సంబధాలను అంటగట్టారు. అదే ఫీనిక్స్ వాళ్ళు రేవంత్ తో ఇపుడు అంటకాగుతున్నారు.
రేవంత్ రెడ్డి పాత స్క్రిప్ట్ ను కవిత తిరగదోడుతున్నారు. రేవంత్ సమాధానం చెప్పాలి. రేవంత్ కు వకాల్తా పుచ్చుకుంటున్న వారు కూడా సమాధానం చెప్పాలి. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి.
ముఖాలు మారాయి .విమర్శలు పాతవే. ఎన్ని కమిషన్లు దొరికాయని అపుడు విమర్శించిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారు? అపుడు తెలంగాణ ద్రోహి అన్న వారికి ఎందుకు కాంట్రాక్టులు ఇచ్చావో చెప్పు రేవంత్ రెడ్డి? అపుడు కేసీఆర్ కే టీ ఆర్ లపై విమర్శలు చేసినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలి.
రేవంత్ రెడ్డి కేసీఆర్ కే టీ ఆర్ లపై బురద జల్లి అధికారంలోకి వచ్చారు. అపుడు రేవంత్ చేసిన ఆరోపణల పై దమ్ముంటే విచారణ జరపాలి. ఆరోపణలు చేసిన వారికే రేవంత్ కాంట్రాక్టులు ఇస్తున్నందుకు అపుడు నిరాధార ఆరోపణలు చేశానని ఒప్పుకోవాలి.