Suryaa.co.in

Andhra Pradesh

సగర – ఉప్పర కులస్తులకు ఒక్క రుణమైనా ఈ సీఎం ఇచ్చారా.?

-ఒక్క రుణమైనా ఈ సీఎం ఇచ్చారా.?
– రాజకీయంగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం
– పీలేరు నియోజకవర్గం, వేపులబయలు సమీపంలోని అంకాళమ్మ దేవాలయం వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసిన సగర – ఉప్పర సామాజికవర్గీయులు

తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ చొర చూపాలని సగర-ఉప్పర కులనేతలు టీడీపీ యువనేత లోకేష్‌ను కలసి అభ్యర్ధించారు. ఆ మేరకు పాదయాత్రలో ఉన్న లోకేష్‌కు వారు వినతిపత్రం సమర్పించారు. సంచార జాతిగా ఉన్న సగరలను బిసి-డి నుండి బీసీ-ఏలోకి మార్చాలి.మా కులవృత్తి దెబ్బతింటోంది..కాంట్రాక్టు పనుల్లో 33.3 శాతం పనులు టెంటర్లు లేకుండా నామినేటెడ్ గా కేటాయించాలి. పనుల నిర్వహణకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలి. సగరులు నిర్మాణరంగ కార్మికులైనందును హౌసింగ్ బోర్డు చైర్మన్ గా సగరులను నియమించాలి.

అమరావతి రాజధానిలో కమ్యూనిటీహాల్ నిర్మించాలి.స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ కు అమరావతిలో ఎకర స్థలం కేటాయించాలి. 50 ఏళ్లు నిండినవారికి పెన్షన్ మంజూరు చేయాలి. రాజకీయంగా వెనకబడిన సగరలకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలి.మా ఆత్మాభిమానం దెబ్బతినేలా ఉన్న ఉప్పర మీటింగ్, ఉప్పరసోది అనే వ్యాఖ్యలను చంద్రబాబు ప్రభుత్వం నిషేధిస్తూ జీవో ఇచ్చింది..దాన్ని మరింత బలోపేతం చేయాలి.

వారి సమస్యలు విన్న లోకేష్‌ అందుకు స్పందిస్తూ.. …
సగర – ఉప్పర కులస్తుల సమస్యలు తీర్చే సత్తా టీడీపీకే ఉంది.కులానికొక కార్పొరేషన్ పేరుతో ఈ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది.సగర – ఉప్పర కులస్తులకు ఒక్క రుణమైనా ఈ సీఎం ఇచ్చారా.? 50 నిండిన వారికి పెన్షన్ ఇచ్చే అంశం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రాజకీయంగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారంలోకి రాగానే మీ ఆత్మాభిమానం దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. సగర-ఉప్పర కులస్తుల న్యాయమైన డిమాండ్లు అధికారంలోకి వచ్చాక పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

LEAVE A RESPONSE