Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీలో భారతి లేఖ కలకలం

ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడని, రాజకీయ కార్యక్రమాల్లో కనిపించని ఏపీ సీఎం జగన్ భార్య భారతీరెడ్డి పేరుతో రాసిన లేఖ, గత రెండు రోజుల నుంచి సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఆమె అనేక రాజకీయ అంశాలతో పాటు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా పేర్కొన్నారు. అయితే అసలు ఆమె అలాంటి లేఖ రాయలేదని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఖండించారు.

భారతీరెడ్డి లేఖ సారాంశం ఇదీ..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు…
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, వైస్సార్సీపీ అభిమానులకు నామనసులోని భావాలు, ఆందోళన, భయాలు చెప్పటానికి మొదటి సారి మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చినది.
పొలిటికల్, పర్సనల్ గా ఎవరిని కామెంట్ చెయ్యటం నా ఉద్దేశ్యం కాదు. వైస్ జగన్ గెలిస్తే ఎవరికీ ఏమి చేస్తాడు అని చెప్పటానికి రాలేదు. ఎవరు ఏ పథకాలను అమలుచేసిన అది వాళ్ళ అబ్బ సొత్తు కాదు మీ సొమ్ము మీకే ఇస్తున్నారు, కానీ నాయకుడు సమ న్యాయం,దూరదృష్టి, ఫలాలు అందరికి అందేలా చెయ్యాలి.

ఒక్కటి చెప్పగలను ఒక మగాడి గుణగణాలను తల్లి తరువాత భార్యే కరెక్ట్ గా చెప్పగలదు. వైస్ జగన్ భార్య గా ఒకటి చెప్పగలను, ప్రతి అవ్వ తాతకు ఒక చేతికర్రలా, ప్రతి తల్లితండ్రులకు ఒక పెద్ద కుమారుడిగా, ప్రతి ఆడపిల్లకు ఒక అన్నలా, పార్టీలకు అతీతం గా, కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ప్రతిఫలాలు అందేలా మా మామ వైస్సార్ లా చేస్తాడు అని చెప్పగలను.

నా మామ గారు మరణించిన దగ్గరనుంచి ఈ రాష్ట్రము లో జరుగుతున్న రాక్షస రాజకీయ క్రీడ కు ఆందోళన చెంది ఇలా మీ ముందుకు వచ్చా. బహుశా రామాయణ, భారతాల్లో కూడా ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరగలేదేమో కానీ ఈ 9 సంవత్సరాలో ఈ రాష్ట్రము లో జరిగాయి. జగన్ అనే ఒక వ్యక్తి ని అణగదొక్కటానికి ఎవరు ఎలాంటి శికండి రాజకీయాలు చేసారో మీకు ఒక్కసారి గుర్తు చెయ్యాలి.

వైస్ జగన్ ఇచ్చిన మాటకోసం ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వెయ్యలేదు వేయడు.. కాంగ్రెస్ టీడీపీ కలసి కేసులు వేసి జేడీ లక్ష్మీనారాయణ గారి ద్వారా ఆర్ధికంగా, మానసికం గా దెబ్బకొట్టాలి అని చుసినా ఏ మాత్రం బెణకని దృఢమైన వ్యక్తిత్వం జగన్ ది, ఈ కారణం గానే వైస్ జగన్ ఒక శక్తీ లా తనని తాను మలుచుకుంటూ ఎదిగాడు. 2014 లో రాష్టం లో వున్న పెద్ద పెద్ద నాయకులు అంతా ఒక వైపు జగన్ ఒక వైపు అయినా స్వల్ప తేడా తో ప్రతిపక్షం లో కూర్చున్నాడు.

గత 9 సంవత్సరాలు అనునిత్యం ప్రజల కొరకు ప్రజల్లో ఒకడిగా ప్రజలతో మమేకం అయ్యాడు. వైస్ జగన్ ఏది దొడ్డి దారిలో సాధించాలని అనుకోడు. ఎవరు ఎన్ని అభాండాలు వేసిన చిరు నవ్వు తో ముందుకు వెళ్ళాడు. ఒక వైపు చంద్రబాబు గారు, మరో వైపు పవన్కళ్యాణ్ అయినా ఎవ్వరికీ జగన్ లొంగలేదు.. పవన్కళ్యాణ్ గారు అంటే మంచి అభిప్రాయం ఉండేది సినిమాల్లో లా బయట కూడా strightforward గా వుంటారు అని కానీ నా అభిప్రాయం తప్పు అని రీసెంట్ గా తెలిసింది.

అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వని మాయావతి గారు ఇక్కడికి వచ్చి ఈయన్ని కలిసినప్పుడే దీని వెనక ఏదో శికండి రాజకియం వుంది అని,పవన్కళ్యాణ్ కి టీడీపీ లోపాయకారి ఒప్పందాలు వున్నాయి అని. నాకు పవన్కళ్యాణ్ గారి వక్తిగత జీవితం గురించి మాట్లాడటం ఇష్టం లేదు ఎందుకంటే ఆలా మాట్లాడితే కొందరి ఆడపిల్లల జీవితాలు ని రోడ్ మీద పెట్టినట్లు అవుతుంది అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను ఒక ఆడదాన్ని, ఇద్దరుఆడపిల్లల కు తల్లి నీ . జగన్ కి దొంగ రాజకీయాలు తెలియదు యుద్ధం ముందు ఉండి చేసే టైపు, వెన్నుపోట్లు, అమ్ముడుపోవటాలు తెలియదు అందుకే 2014 లో ఓడిపోయాడేమో.

గత తొమ్మిది సంవత్సరాలుగా కుసంస్కారమైన కామెంట్స్ అన్ని భరించాను.. జగన్ వెన్నుపోటు పొడిచి ఎవరి పార్టీ ని లాక్కోలేదు, ఎవరికి పార్టీ ని ప్యాకేజీలకు అమ్ముకోలేదు. అవినీతిపరుడు అని అంటున్నారు అధికారం లో వుంది వాళ్లే ఏమి పీకారు 9సంవత్సరాలు , చేతనైతే నిరూపించండి,లేదా మూసుకుని కూర్చోండి. అన్యాయం గా కేసులు పెట్టారు అయినా మాకు భయం లేదు స్టే లు తెచ్చుకోలేదు ధెర్యం గా ఎదర్కొంటున్నాము ఎవరి కాళ్ళ పట్టుకోము మీ లాగా.

ఒక మనిషి మీద దాడి జరిగితే నిస్పక్ష పాతం గా దర్యాప్తు చేయకుండా కోడికత్తి అంటున్నారు ఎగతాళిగా.. నీ కొడుక్కో నీ మానవడికో దిగితే కోడి కత్తి వల్ల ఏమి జరుగుతుందో తెలిసేది బాబు గారు.
మా చిన్న మామ గారిని ఎవరో హత్య చేస్తే మా మీద బురద చల్లటం.. మాకు దోషులు ఎవరైనా శిక్ష పడటం కావాలి అది బయట వాడు అయినా ఇంట్లో వాడు అయినా అందుకే సిబిఐ ఎంక్వయిరీ అడిగాము. తండ్రి లాంటి మనిషిని పోగొట్టుకుని మేము బాధ లో ఉంటే మీ పెంట రాజకీయాలు … Growup చంద్రబాబు.
బందిపోటు అని అంటున్నావు yes బందిపోటు ప్రజల మనసులు దోచుకునే బందిపోటు అందుకే నీకు గుండెపోటా.. ఇలాంటి నీచ రాజకీయాలు ఇక చెల్లవు.

జగన్ కి దమ్ము ధెర్యం నీతి జాతి వంశపారంపర్యం గా వచ్చినవి మీరు ఎన్ని కుతంత్రాలు కుట్రలు పన్నినా నవ్వుతు ముందు కు సాగుతాడు. వీరుల పోరాటం అయితే నిజాయితీ గా ఉంటుంది కానీ ఇక్కడ జగన్ వక్కడే వీరుడు మిగిలిన వాళ్ళు అందరూ ముసుగు దొంగలు వాళ్ళు నెగ్గాలి అని యుద్ధం చెయ్యటం లేదు అందరూ కలసి ఎలాగైనా జగన్ ని ఓడించాలి అని పోటీ చేస్తున్నారు.

జగన్ ముక్కుసూటి గా ముందుకు వెళ్ళేటైపు అదే నా భయం ఈ దొంగలు చేసే అనైతిక యుద్ధం లో జగన్ ని ఏమైనా చేస్తారేమో అని.. ఇప్పటికే మా కుటుంభం చాల నష్ట పోయింది ఇంకా తట్టుకునే శక్తీ మాకు లేదు.. చంద్రబాబు and co మీరు అధికారం కోసం జగన్ కి ఏ హాని చేయకండి మీకు అలాంటి వెధవ ఆలోచనలు ఉంటే చెప్పండి నేను మా ఆయనకి నచ్చ చెపుతా ఇలాంటి వెధవలతో,నీచులతో రాజకీయాలు వద్దు అని. నేను ప్రజలను అడిగేతి ఒక్కటే నిజాయితీగా మీ మసాక్షి గా ఆలోచన చెయ్యమని.. ఎవరు నిజాయితీగా ఉన్నారు.

ఎవరు అవసరాన్ని బట్టి మాటలు మార్చుతున్నారు అని ఆలోచించండి. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ కుళ్లి పోయింది , దీని నవనాడులు లో జవసత్వాలు పోయాయి. ఈ వ్యవస్థ ని సరి చెయ్యాలి అంటే ఒక దృఢమైన మనస్తత్వం వున్న బలమైన సంకల్పం వున్న వైస్ జగన్ లాంటి నాయకుడు కావాలి,అందుకే నేను ప్రతి ఒక్క సోదరీసోదరులను కోరేది ఒక్కటే.

మీ రాబోయే పాతికేళ్ల భవిష్యత్తు మీ చేతుల్లో వుంది కుళ్ళు కుతంత్రాలు చేసే నాయకుడు కావాలో లేక కుళ్ళి పోయిన ఈ వ్యవస్థలను సరిచెయ్యటానికి యుద్ధం చేసే సైనికుడు లాంటి వైస్ జగన్ కావాలో మీరే నిర్ణయించాలి. మీ భవిష్యత్తు ఎవరి బాధ్యత కాదు మీ భవిష్యత్ మీ చేతుల్లోనే వుంది. నిర్ణేతలు మీరే….

మీ… వైయస్ భారతీ
YS Jagan Mohan Reddy
YSR Congress Party – YSRCP
YS Bharathi Reddy FC

ఆ ఉత్తరం భారతమ్మ రాసింది కాదు
– ఎవరో భారతమ్మ పేరుతో కావాలనే ఆ లెటర్ ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు
– మీడియాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
“ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతమ్మ ఏదో లెటర్ రాశారని, సోషల్ మీడియా- వాట్సాప్ గ్రూపుల లో సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అవుతున్న లెటర్ భారతమ్మ రాసింది కాదు. ఆ ఉత్తరం నకిలీది…” అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. భారతమ్మ ఏ లెటర్ రాయలేదు అని, ఎవరో కావాలని అలాంటి ఉత్తరాలు సర్క్యులేట్ చేస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు అని అన్నారు. భారతమ్మ కి అటువంటి లెటర్ రాయాల్సిన అవసరం కూడా లేదు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE