ఏప్రిల్ లో బ్లూ బుక్ అన్నాడు. ఎవడూ దేకలేదు. తాజాగా డిజిటల్ బుక్ అంటున్నాడు. లాంచ్ చేశాడు. యాప్ టెస్ట్ కూడా చెయ్యనట్లుంది. వస్తాడా.. చస్తాడా.. ఏదో ఒక టైం పాస్ అని యాప్ చేసినట్లున్నారు. అది ఓటీపీ జనరేట్ అని గింగిరాలు తిరిగాక ఎర్రర్ వస్తోంది.
దీని కోసం ఎగేసుకుని యాలహంకా ప్యాలెస్ నుండి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చాడు. అదేదో సీరియస్ అని మొహాలు వేలాడదీసుకొని పార్వతి మేడం నుండి అందరి మెడల్లో ప్రెసిడెంట్ మెడళ్ల లెక్కన వేలాడదీసుకొని కూర్చున్నారు. ఈ బెదిరింపులకు ఎవడూ భయపడరు.
సోషల్ మీడియాలో ముందులా అసభ్యకరంగా పిచ్చికూతలు కూస్తే కుమ్మేస్తారు. సహనం నశించింది సమాజానికి. ఎన్ని పెటాబైట్లు తీసుకొని పేర్లు వ్రాసుకొన్నా.. ఈ జన్మలో జగన్ వచ్చేది లేదు. ఈ బులుగు, డిజిటల్ బుక్కుల బెదిరింపులకు ఎవడూ భయపడడు. సంస్కరించి వదులుతారు, తేడాగా అబద్దాలు, అసభ్య వ్రాతలు వ్రాసినా.. కూతలు కూసినా. 5 రూపాయల కోసం ఈ కుట్రలో పావులై జీవితాలు పాడుచేసుకోకండి.