-అటెండర్ నుంచి అత్యున్నతస్థాయి అధికారి వరకూ
-పేరుపేరునా పలకరించి అందరితో ఫోటోలు
-449 రకాలతో ఏర్పాటు చేసిన విందు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తొలిసారిగా టిడిపి పార్టీ ఆఫీసు మరియు తన సిబ్బంది కి రాత్రి ఓ భారీ విందు ఇచ్చారు. 449 రకాలతో ఏర్పాటు చేసిన విందు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే అటెండర్ నుంచి అత్యున్నతస్థాయి అధికారి వరకూ అందరినీ పిలిచి మరీ బుధవారం రాత్రి తన కరకట్ట మీదున్న ఉండవల్లి నివాసంలో విందు ఇచ్చారు.
ప్రతిపక్షనేతగా నిత్యమూ ప్రజల్లో వుంటుండడమే కానీ, ఉద్యోగులతో విధి నిర్వహణ సందర్భంలో కలవడమే కానీ..ప్రత్యేకించి చంద్రబాబు ఉద్యోగులందరికీ ఇలా విందు ఇచ్చిన సందర్భం లేదు.
టిడిపి ఆఫీసులో రోజూ అతిథిమర్యాదలు, భోజనాలు,టీలు,కాఫీలు అతిథులతోపాటు ఉద్యోగులకి ఏర్పాటు చేస్తారు.పండగలు,ప్రత్యేక సందర్భంలో భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే తొలిసారిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తన ఉద్యోగులందరినీ పిలిచి తన ఇంట్లో విందు ఇవ్వడం చాలా చాలా ప్రత్యేకంగా నిలిచింది. అందరితో కలిసి భోజనాలు చేసిన చంద్రబాబు, పేరుపేరునా పలకరించి అందరితో ఫోటోలు దిగారు. ప్రత్యేక సందర్భం ఏమీ లేకపోయినా ఉద్యోగులందరినీ పిలిచి విందు ఏర్పాటు చేయడమే కాకుండా ఆప్యాయంగా వారితో చంద్రబాబు సంభాషించడంతో ఉద్యోగుల్లో ఏనలేని సంతోషం నిండింది.