– ప్రమోషన్లు, బదిలీలపై ప్రభావం
– ఒకే మల్టిజోన్కే పరిమితం కావాల్సిన పరిస్థితి
హైదరాబాద్: స్వరాష్ట్ర కల సాకారం అయితే తమకున్న పరిధులు విస్తృతం అవుతాయని భావించిన వారికి కొత్త జోనల్ వ్యవస్థ నైరాశ్యంలోకి నెట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జోనల్ వ్యవస్థ తరువాత అధికార యంత్రాంగం బదిలీలు చేసుకునే ప్రక్రియ మరింత కుంచించుకపోతున్నది. అంతా అయోమయంగా మారిన ఈ నిర్ణయాల ప్రభావం తమపై మరింత తీవ్రంగా పడుతోందన్న వేదన పోలీసు యంత్రాంగంలో వ్యక్తం అవుతోంది..
కొత్తగా అమలు చేయనున్న ఈ విధానాన్ని నూతనంగా ఉద్యోగంలోకి వచ్చిన వారికి అమలు చేయాల్సిందిపోయి, ఇప్పటికే సర్వీసులో కొనసాగుతున్న వారికి కూడా వర్తించే విధంగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడమే ఇబ్బందిగా మారింది. పదోన్నతులు వచ్చినా కొద్ది పోస్టింగ్‌లు చేయించుకునే పరిధిలు మరింత విస్తృతం అవుతాయని, అనుకున్న వారికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం నైరాశ్యంలోకి నెట్టేసిందనే చెప్పాలి.
ప్రధానంగా జోనల్, మల్టీ జోనల్, స్టేట్ లెవల్ పోస్టులుగా ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్న ఆందోళన పోలీసు అధికారుల్లో నెలకొంది. కొత్త విధానంతో ఎస్సై, సీఐ స్థాయి అధికారులు జోన్ వరకు, డీఎస్పీ స్థాయి అధికారి మల్టీజోన్ల వరకు మాత్రమే పరిమితం కానున్నారు. ఈ విషయంలో ఉన్నత స్థాయిలో జరిగిన చర్యల వల్ల అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే స్టేట్ లెవల్ పోస్ట్‌గా ఉన్న డీఎస్పీ పోస్ట్ కొత్తగా తీసుకున్న నిర్ణయంతో మల్టీజోన్కే పరిమితం కానుంది.
తెలంగాణ ఆవిర్భావం అయిన తరువాత హైదరాబాద్ మహానగరాన్ని ఫ్రీ జోన్‌గా తీసేయాలన్న డిమాండ్‌ను వినిపిస్తూ తమకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలా చేయడం వల్ల తాము కూడా హైదరాబాద్ జోన్లో విధులు నిర్వర్తించే అవకాశం ఉండడంతో పాటు ప్రమోషన్లలో కూడా తమకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించినట్టు అవుతుందని వరంగల్ జోన్ పోలీసు అధికారులు కోరుతున్నారు.
వీరు చేసిన అభ్యర్థనలను పట్టించుకోని ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మరింత నిరుత్సాహానికి గురువుతున్నారనే చెప్పాలి. ఇప్పటి వరకు స్టేట్ లెవల్ పోస్టుగా పరిగణించబడ్డ డీఎస్పీ పోస్ట్ మల్టీజోన్ వరకే పరిమితం కానుంది. అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన డీఎస్పీలు దక్షిణ తెలంగాణకు, అక్కడి అధికారులు ఇక్కడకు ఇక నుండి బదిలీ అయ్యే అవకాశం లేకుండా పోతోంది.
రెండు మల్టీ జోన్లలో నియామకం అయ్యే డీఎస్పీలు మరో ప్రమోషన్ వచ్చే వరకు అయినా, రిటైర్డ్ అయ్యే నాటికి అయినా ఒకే మల్టిజోన్కే పరిమితం కావాల్సిన పరిస్థితి తయారైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన తరువాత తమ పరిధి మరింత పెరుగుతుందని ఆశించినప్పటికీ కొత్త జోనల్ వ్యవస్థ సరికొత్త సమస్యను తెచ్చి పెట్టిందా అన్న చర్చ పోలీసు అధికారుల్లో మొదలైంది.
1989 బ్యాచ్ నుండి వరంగల్ జోన్లో నియామకం అయిన పోలీసు అధికారులు పదోన్నతుల్లో అన్యాయానికి గురువుతున్నారు. నక్సల్స్ ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసినప్పటికీ తమకు మాత్రం పదోన్నతులు సకాలంలో కల్పించలేదని అంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ విధానంతో అయితే , డీఎస్పీ స్థాయి అధికారి హైదరాబాద్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేకుండా పోతోందన్న ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది.
ఇక పోతే సీఐ, ఎస్సై స్థాయిల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న అధికారులు జోన్ వరకే పరిమితం కావాల్సి ఉంటుంది. డీఎస్పీ అయితే తప్పా వేరే జోన్‌కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు జోన్ పోస్టులుగా ఉన్న ఈ రెండు పోస్టులను అదే స్థాయికి పరిమితం చేశామని అనుకుంటున్న ఉన్నతాధికారులు ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన పోలీసు అధికారులు అప్పటి జోనల్ వ్యవస్థ పరిధిల్లోనే నియామకం అయ్యారు.
అప్పటి ప్రకారం అంటే ఉమ్మడి జిల్లాలను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం జోనల్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీనివల్ల ఉమ్మడి జిల్లాల వారిగా నియామకం అయిన వారు ఇప్పుడు మరింత తక్కువ పరిధికే పరిమితం కావల్సిన పరిస్థితి తయారైంది. కొత్తగా ఏర్పాటయిన జోన్లలోని జిల్లాలు పూర్వ జిల్లాలకు పోలిక లేకుండా ఉంటుందన్నది వాస్తవం.
విప్లవ సంస్థల ప్రాబల్యం ఉన్న రోజుల్లో అయితే ఆయా ప్రాంతాల్లో పనిచేసిన పోలీసు అధికారులకు ఆ తరువాత పోస్టింగ్.. అర్బన్ ఏరియాలో ఇచ్చేవారు. ప్రాణాలకు తెగించి ప్రాబల్య ప్రాంతాల్లో ఉద్యోగం చేశారన్న కారణంతో వారికి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనో లేక ఇతర పట్టణాల్లోనే పోస్టింగ్ ఇచ్చే విధానం అమలు అయ్యేది. అయితే ఇప్పుడు ఉమ్మడి జిల్లాను విభజించి నూతన జిల్లాలు ఏర్పాటు చేసి జోన్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఉమ్మడి జిల్లాలను పరిగణనలోకి తీసుకుని అధికారులుగా ఉన్న వారు ఇప్పుడు లిమిటెడ్ ఏరియాకు పరిమితం కావాల్సి వస్తోంది.
ఉదాహరణకు వరంగల్ జోన్‌ను పరిశీలిస్తే.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు దీని పరిధిలో ఉండేవి. ఇప్పుడు ఈ ఏరియా మూడు జోన్లుగా ఆవిర్భవించింది. దీనివల్ల ఇప్పుడున్న పరిధి కన్నా చాలా తక్కువ పరిధికే తాము పరిమితం కావల్సి వస్తుందన్న ఆందోళన పోలీసు అధికారుల్లో వ్యక్తం అవుతోంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన వారికి పూర్వ విధానంలో, కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి కొత్త జోనల్ విధానం అమలు చేస్తే సమస్యను కొంతమేర అధిగమించినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అలాగే కిందిస్థాయిలో పనిచేసే ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లకు కూడా పూర్వ జిల్లాల వరకు బదిలీ 1. పాత జోన్ ల ప్రకారం (V and VI) లను ఇప్పటి multi zone లను arrenge చెయ్యాలని కొరలి దానివలన నిజామాబాద్, కామారెడ్డి. మెదక్ అండ్ సిద్దిపేట లను multi zone II లో కలపాలి. అదేవిధంగా జనగామ ను multi జోన్ 1 లో కలపాలి.
New zowel system వలన sinioety (same batch defferent zones promotions) issue వస్తుంది కావున న్యూ zonal system ను ఇప్పుడు న్యూ గా recruitment అయ్యే వారికి implement చెయ్యాలి పాత వారికి పాత పద్దతి ఉండేటట్లు చూడమనలి.
Multi Zone II లో 100 వరకు inspectors officers accece అవుతారు కావున వారిని multi జోన్ 1 లోకి పంపడానికి అవకాశం ఉంటుంది కావున ఈ 100 ఆఫీసర్స్ కు సూపర్ న్యూమెరికల్ creat చేసి వారిని multi zone II లో accomded చెయ్యమనలి.
Local caders కు ముందుగా option ఇఛ్చి Non local (15 శాతం) all batch కు తరువాత option ఇవ్వాలి.