-జగన్ సెక్యూరిటీని తెల్లారేసరికి తీసేయడం ఎంతవరకు కరెక్ట్?
-వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి
తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులు చాలా విలువను పొందుతున్నామని అనుకుంటున్నారేమో కానీ ఉద్యోగులపై అప్పుడే వివక్ష మొదలైంది, వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను ఈనాడులో జలగన్నలంటూ రాశారు, అధికారులను అవమానిస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వ అధికారులను అదిరించి, బెదిరించి తన అజమాయిషీ చాటుకున్నారు, వారిని అనేక రకాలుగా అవమానించారు, మేం ఇంత త్వరగా రెస్పాండ్ కాకూడదని, ఈ ప్రభుత్వానికి 3 నెలలో, 6 నెలలో సమయం ఇవ్వాలనుకున్నాం. అప్పటివరకు ఆరోపణలు చేయకూడదనుకున్నాం. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీయాలనుకున్నాం, కానీ ప్రభుత్వ అధికారులను అవహేళన చేసేవిధంగా రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాం.
2014 నుంచి 19 వరకు డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు రాజమౌళి ఐఏఎస్, కేవీవీ సత్యనారాయణ, వెంకయ్య చౌదరి, కల్నల్ అశోక్ బాబు, సంధ్యారాణి (పోస్టల్ డిపార్ట్‌మెంట్), గురుమూర్తి (సెంట్రల్ సర్వీస్), శ్రీనివాస్ (సర్వశిక్షా అభియాన్), జాస్తి కృష్ణకిశోర్ (తాళాలన్నీ ఇతనికే ఇచ్చారు కదా), వెంకటేశం (సమాచార కమీషనర్), రమణారెడ్డి (రైల్వే శాఖ) వీరందరికీ ఇలాంటి పేర్లు ఏం పెట్టాలి, వీరంతా అనకొండలా లేక కొండచిలువలా, మేం ప్రశ్నిస్తున్నది సద్దుద్దేశంతోనే, అంతే కానీ అవహేళన చేయడానికి కాదు.
ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ దాడులు దేనికి నిదర్శనం, రాబోయే రోజుల్లో మీరే చింతించాలి, ప్రజలంతా గమనిస్తున్నారు. జగన్ సెక్యూరిటీని తెల్లారేసరికి తీసేయడం ఎంతవరకు కరెక్ట్, ఆయనకు చెడుజరగాలని కోరుకుంటున్నారా లేక మీ స్పాన్సర్డ్ మీడియా వారిని పంపి హడావిడి చేయిస్తారా?
వీఐపీలు ఉండే రోడ్లలో చెక్‌పోస్ట్‌లు ఉండటం, ఐడీ కార్డు అడగడం ప్రతి చోటా ఉంటుంది, మా పార్టీ తరపున కేంద్రానికి అప్పీల్ చేస్తున్నాం, వైఎస్ జగన్ గారికి వీలైనంత త్వరగా జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలని కోరుతూ దానికి సంబంధించిన రెప్రజెంటేషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన అన్నారు.