-ఆడపిల్లపై దారుణానికి ఉరిశిక్ష
-దిశ స్ఫూర్తితో దర్యాప్తు, విచారణ
గుంటూరు ఇంజినీరింగ్ విద్యార్ధి రమ్య హత్య కేసులో వంశీకృష్ణకు ఉరిశిక్ష.పోలీసుల దర్యాప్తు, కోర్టు శిక్ష ప్రక్రియలో స్పష్టంగా కనిపించిన దిశ మార్పు.కళ్లముందు కనిపించిన సత్వరదర్యాప్తు, సత్వర శిక్ష.ఆగస్టు 15, 2021న రమ్య హత్య.సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు.10 గంటల వ్యవధిలో అరెస్టు.2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నిర్ధారణ.దిశ కింద కొత్త ల్యాబులు, సామర్థ్యం పెంపుతో అత్యంత వేగంగా ఫోరెన్సిక్ ఫలితాలు.
ఘటన జరిగిన వారంరోజుల్లో దిశ ప్రకారం ఛార్జి షీటు దాఖలు.క్రమం తప్పకుండా కోర్టు విచారణ.వాదనలు వినిపించిన దిశ ప్రత్యేక న్యాయవాది.257 రోజుల్లో తీర్పు ఇచ్చిన గుంటూరు కోర్టు.నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు.