Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయండి

– వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై ముఖ్యమంత్రి జగన్‌కు పిర్యాదు చేసిన తెదేపా నేత వర్ల రామయ్య
• వినుకొండలో దళితులకు చెందిన అసైన్డ్‌భూములను బలవంతంగా ఆక్రమించుకున్నారని పిర్యాదు

– 175 ఎకరాల అసైన్డ్ భూములను బ్రహ్మనాయుడు దళితుల నుంచి బలవంతంగా లాక్కున్నాడు.
• వినుకొండలో బ్రాహ్మణపల్లెలో వత్సా ఫుడ్ పార్క్ నిర్మించేందుకు దళితుల భూములను ఆక్రమించుకున్నాడు.
• జరిగిన అన్యాయంపై పేద దళితులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్ని పిర్యాదులు చేసిన పట్టించుకోలేదు.
• పోలీసులు, రెవెన్యూ అధికారులు బాధితులకు న్యాయం చేయకపోగా ఎమ్మెల్యేకు సహకరించారు.
• న్యాయం కోసం దళితులు చివరికి గౌరవ హైకోర్టును ఆశ్రయించారు.
• అసైన్డ్ భూముల ఆక్రమణపై సమగ్ర విచారణ చేసి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని గౌరవ హైకోర్టు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
• మీ పార్టీ శాసనసభ్యుడైన బొల్లా బ్రహ్మనాయుడు దళితుల భూములను ఆక్రమించి అధికార దుర్వినియోగంకు పాల్పడ్డారు.
• బ్రహ్మనాయుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రాకారం శిక్షార్హుడు.
• కావున, బొల్లా బ్రహ్మనాయుడిపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకుని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయండి.
• బ్రహ్మనాయుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయించండి.
• నా ఎస్పీలు, నా ఎస్టీలు అని నిత్యం జపం చేసే తమరు అణగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోండి.

LEAVE A RESPONSE