దివ్యాంగుల దినోత్సవ వేదికపై ఉద్వేగంగా ప్రసంగించిన వ్యక్తి మరెవరో కాదు… భారత బ్లైండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మరియు 2023 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు గ్రహీత అయిన ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి. దృష్టిలోపం ఉన్న క్రీడాకారుల్లో ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి ఆటగాడు ఈయనే కావడం విశేషం! ఆంధ్రప్రదేశ్‌లోని గురజాల/గుంటూరు ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ రెడ్డి, పేద వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి దేశానికి అద్భుతమైన విజయాలను అందించారు.
క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు జనవరి 9, 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నారు. బ్లైండ్ క్రికెట్ చరిత్రలో అర్జున అవార్డు పొందిన మొదటి ఆటగాడు ఈయనే. 2016 నుండి భారత బ్లైండ్ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ఒక ODI వరల్డ్ కప్, రెండు T20 వరల్డ్ కప్‌లు మరియు ఒక T20 ఆసియా కప్ టైటిల్‌ను సాధించింది. ముఖ్యంగా 2022 T20 వరల్డ్ కప్‌తో భారత్ టైటిళ్ల హ్యాట్రిక్ నమోదు చేసింది. అంతర్జాతీయ బ్లైండ్ క్రికెట్లో బహుళ సెంచరీలు, అర్ధ సెంచరీలు మరియు 200కు పైగా వికెట్లు తీసి ఆల్-రౌండర్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆరేళ్ల తరువాత ఆనందంగా ఉందంటూ.. అర్జున అవార్డు తీసుకు వచ్చి బాబు గారి చేతుల్లో నుండి తీసుకుని మురిసిపోయాడు.