Home » ఖ‌జానా ఖాళీ అయినా…ఇచ్చిన మాట త‌ప్ప‌లేదు

ఖ‌జానా ఖాళీ అయినా…ఇచ్చిన మాట త‌ప్ప‌లేదు

– రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున సీఎం చంద్ర‌బాబుకి ధ‌న్య‌వాదాలు
– జులై 1వ‌తేదీ 65 ల‌క్ష‌ల మంది ఫించ‌న్లు పంపిణీ
– రాష్ట్ర‌మంతా ఫించ‌న్ల పండుగ
– ఫించ‌న్ల పంపిణీ కోసం 8వేల మంది ఉద్యోగులు సిద్ధం
– అన్నీ ఏర్పాట్లు పూర్తి
– పాల‌న చేత‌కాని జ‌గ‌న్‌
– అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రం
– గాడిలో పెట్టే స‌త్తా ఒక్క చంద్ర‌బాబుకే ఉంది
రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌
– ఫించ‌న్ల పంపిణీపై నెల్లూరు కార్పొరేష‌న్లో… అధికారుల‌తో తొలి సారి స‌మీక్షించిన నారాయ‌ణ‌, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి, డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్

రాష్ట్ర ఖ‌జానా ఖాళీ అయిపోయినా…ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన మాట త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తున్న ఏకైక నాయ‌కుడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ప్ర‌శంసించారు. జులై 1వ‌తేదీ ఫించ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంపై… నెల్లూరు న‌గ‌రంలోని కార్పొరేష‌న్ కార్యాల‌యంలో, అధికారుల‌తో నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిల‌తో క‌లిసి నారాయ‌ణ స‌మీక్షించారు. ఫించ‌న్ల పంపిణీ ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా, కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని అధికారుల‌కి నారాయ‌ణ సూచించారు.

ఈ సంద‌ర్భండా మంత్రి డాక్ట‌ర్ నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ… ఎన్నిక‌లకు ముందు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు 3వేల ఫించ‌నుని రూ. 4వేలు…అలాగే దివ్యాంగుల‌కి 3వేలు నుంచి 6వేలు చేస్తామ‌ని…హామీ ఇచ్చార‌న్నారు. సీఎం అయిన త‌రువాత దానిపైనే మొద‌టి సంత‌కం చేశార‌ని…కేబినెట్‌లో కూడా దీనిని ఆమోదించార‌న్నారు. దానిని జులై 1వ‌తేదీన ల‌బ్ధిదారులంద‌రికి ఫించ‌ను ఇవ్వాల‌ని ఆదేశించార‌న్నారు.

రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇందుకు సంబంధించి అన్నీ జిల్లాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశార‌న్నారు. నెల్లూరు జిల్లాలో కూడా పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేశార‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మంపైన నేను, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిలు క‌లిసి కార్పొరేష‌న్ కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్షించామ‌న్నారు.

ఫించ‌న్ల కోసం సుమారు 8వేల మంది ఉద్యోగుల్ని నియ‌మించామ‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎల‌క్ష‌న్ క‌మిష‌న్…ఫించ‌న్ల‌ను వాలంటీర్లు పంపిణీ చేయ కూడ‌ద‌ని ఆదేశిస్తే, దానిని కూడా టీడీపీ చేయించింద‌ని ఆరోపించార‌న్నారు. ఫించ‌న్లు పంపిణీ చేసేందుకు సెక్ర‌టేరియ‌ట్‌ ఉంద‌ని, చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉన్నార‌ని వారి చేత ఇప్పించ‌మ‌ని తెలిపార‌న్నారు. దానిని వైసీపీ ప్ర‌భుత్వం పాటించ‌క‌పోవ‌డంతో ఎంతో మంది ల‌బ్ధిదారులు చ‌నిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కానీ రేపు సెక్రటేరియ‌ట్ ఎంప్లాయిస్‌, మిగ‌తా ఎంప్లాయిస్ అంద‌రూ క‌లిసి ఒకే రోజు ఫించ‌న్లు పంపిణీ పూర్తి చేయాల‌ని, కానీ ప‌క్షంలో రెండో రోజు లోపే పూర్తి చేయాల‌న్నారు. దీని కోసం అధికారులంద‌రూ చ‌క్క‌గా ఏర్పాట్లు పూర్తి చేశార‌ని, ఇందుకు అధికారులంద‌రిని ఆయ‌న అభినందించారు. రాష్ట్ర ఖ‌జానా ఖాళీ అయిపోయినా, ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఇచ్చిన మాట ప్ర‌కారం…అవ్వా తాత‌లు, దివ్యాంగుల ల‌బ్ధిదారులంద‌రికి ఫించ‌న్లు అంద‌చేస్తున్నార‌న్నారు. ఇందుకు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రి త‌ర‌పున సీఎం చంద్ర‌బాబుకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని చెప్పారు.

2019లో నేను మంత్రిగా ఉన్న‌ప్పుడు రూ. 5300 కోట్ల‌తో కొన్ని ప్రాజెక్టుల‌ను తీసుకువ‌చ్చాన‌న్నారు. కానీ గ‌త ఐదేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వం ఆ ప్రాజెక్టుల‌న్నీ ప‌క్క‌న పెట్టేసింద‌న్నారు. అవ‌న్నీ పూర్త‌యి ఉంటే… రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేద‌న్నారు. అయితే వైసీపీ ప్ర‌భుత్వం కేవ‌లం రూ. 240 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింద‌ని విమ‌ర్శించారు. ఆంధ్ర‌రాష్ట్రంలో ఆర్ధిక ప‌రిస్థితి అధ్వానంగా ఉంద‌న్నారు.

రాష్ట్రాభివృద్ధి జ‌ర‌గాలంటే ముఖ్యంగా ఆదాయం పెర‌గాల‌ని, ప‌రిశ్ర‌మ‌లు రావాల‌ని, రియ‌ల్ ఎస్టేట్ పెర‌గాల‌ని, ఇలాంటి ఆలోచ‌ల్ని జ‌గ‌న్ చేయ‌లేద‌న్నారు. అనంత‌రం ఎంపీ వేమిరెడ్డితోపాటు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్ తోపాటు…కార్పొరేష‌న్ అధికారులు, టీడీపీ నాయ‌కులు పాల్గొన్నారు.

Leave a Reply