ప్రకృతి వైపరీత్యాలకు, విపత్కర పరిస్థితులలో చేయూత అందించడం తమ నైజం అని లయన్స్ క్లబ్ గవర్నర్ లయన్ జె . రామచంద్ర ప్రకాష్ రావు తెలిపారు. ఇటీవల కురిసిన అనంతపురం వరదలకు నగర శివారు ప్రాంతాలు జలదిగ్బంధం అయి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది ఈ ప్రాంతాలకు చెందిన వారికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుండి తక్షణ సహాయంగా పదివేల డాలర్లు వితరణ ఇవ్వడం అలాగే స్థానికంగా 1,70,000 రూపాయలు కలుపుకొని పది లక్షల విలువైన సహాయం వెయ్యి
కుటుంబాలకు ఇవ్వడం అయినదని తెలిపారు. ఆంధ్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని 1-11-2022 న జిల్లా ఎస్పీ డా కే పక్కీరప్ప మరియు జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మరియు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రమేష్ నాథ్ రెడ్డి, విడిజి లు, స్థానిక క్లబ్లు సారథ్యంలో రుద్రంపేట, వెంకట్ రెడ్డి ఫంక్షన్ హల్ నందు వరద బాధితులకు కిట్లు ఇవ్వడమైనది. కార్యక్రమంలో కోఆర్డినేటర్ లయన్ విరూపాక్ష రెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి రుఖియా బేగం, ప్రజా సైన్స్ వేదిక అధ్యక్షులు డా యం. సురేష్ బాబు, లయన్స్ క్లబ్ ఎలైట్ అధ్యక్షులు వైష్ణవ శ్రీనాథ్, డిసి లయన్ టి సత్యనారాయణ, నాగేంద్ర ప్రసాద్, గుత్తి, పామిడి, ఉరవకొండ, అనంతపురం మెయిన్, కణేకల్లు క్లబ్ సభ్యులు వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.