-ఏర్పాట్లు చేసుకుంటున్న నిర్వాహకులు
హైదరాబాద్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన పంపిణీదారు బత్తిన కుటుంబం కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం ఇచ్చేందుకు ఈ ఏడాది కూడా జూన్ 8 నుంచి ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించా రు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతున్నా రు. అందుకే ఈ ప్రసాదం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే వాళ్ల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం దీనిని పంపి ణీ చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నట్టు సమాచారం. ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు.
ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన రోజున ఈ ప్రసాదం బతికి ఉన్న చేపలో పెట్టి పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. ఆరోజు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నట్టు బత్తిన అనురీత్‌గౌడ్, గౌరీ శంకర్‌గౌడ్‌లు వెల్లడిరచారు. పంపిణీలో భాగంగా ముందు రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం, భావి పూజ చేసిన తర్వాత ప్రసాదం తయారీ ప్రక్రియ పూర్తి చేస్తారు. తర్వాత రోజు జూన్ 8 నుంచి పంపిణీ ప్రారంభిస్తారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.