విజయవాడ: పశ్చిమ నియోజకవర్గం 52 వ డివిజన్ కి చెందిన దావులూరి అప్పారావు కిడ్నీ కి సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నాడు. అతనికి సర్జరీ నిమిత్తం 3,00,000/- రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆయన సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను సంప్రదించి విషయం తెలిపారు. 54 వ డివిజన్ కు చెందిన బద్రే ఆలం రోడ్డు ప్రమాదంలో కాలికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు.
అందుకు 4,30,600/- రూపాయల వ్యయం అవుతుందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇద్దరికీ ఆర్థిక సాయం కోసం సీఎం ఆర్ ఎఫ్ కు లేఖలు రాసారు. వాటికి సంబంధించిన ఎల్వోసీ పత్రాలను బాధితుల కుటుంబ సభ్యులకు అంద చేశారు.. కార్యక్రమంలో ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు తారీక్ అజీజ్, బీజేపీ నాయకులు హరి ప్రసాద్, సుజనా మిత్ర లు పాల్గొన్నారు.