– 4 వేల గజాల పైబడి 920 ప్లాట్లు
రాజధాని అమరావతి పరిధిలో మాస్టర్ ప్లాను ప్రకారం రైతులకిచ్చిన ప్లాట్లను విభజించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. విభజన చేస్తే గతంలో అనుకున్న నిబంధనలు అమలు చేయడం సమగ్ర రాజధాని నిర్మాణ ప్లాను అమలు కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది.
దీనిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి ఏర్పాటు సమయంలో రాజధానిలో నవనగరాల ప్రణాళిక అమలు చేశారు. అనంతరం ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాధాన్యత కల్పిస్తూ మాస్టర్ ను రూపొందించారు. దీనిలో రెసిడెన్షియల్, కమర్షియల్ గా విభజించి ఒక్కోదానికి ఒక్కో తరహా ప్రాంతాన్ని నిర్దేశించారు.
ఒక ప్రాంతంలో ఒకే నిర్దేశిత కట్టడాలు ఉండాలని, దానికి అనుగుణంగానే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కూడా ఉండాలని సూచించారు. ఇలా తయారుచేసిన ప్లాట్లను విస్తీర్ణం ఆధారంగా మాస్టర్పాను రూపొందించారు. దీనివల్ల మొత్తం రాజధానిలో నిర్మాణాలు ఒకేలా ఉండేలా చూడాలని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
పలు సందర్భాల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రసుత్తం రాజధాని పరిధిలో 4 వేలు చదరపు గజాల ప్లాట్లు పైబడి 25 వేల గజాల వరకూ 920 ప్లాట్లు ఉన్నాయి. వీటిల్లో 4 వేల నుండి 5 వేల గజాల వరకూ 512 ప్లాట్లు ఉన్నాయి.
5 వేల నుంచి 6 వేల గజాల వరకూ 186, 6 వేల నుంచి 8 వేల గజాల మధ్యలో 89 ప్లాట్లు ఉన్నాయి. 8 వేల నుంచి 12 వేల గజాల మధ్యలో 88 ప్లాట్లు ఏర్పాటు చేశారు. 12 వేల గజాల నుంచి 13 వేల గజాల మధ్యలో ప్లాట్లు 13, 13 వేల నుంచి 14 వేల గజాల మధ్యలో 6, 15 వేల గజాల నుంచి 16 వేల గజాల మధ్యలో 3, 17 వేల గజాల నుంచి 19 వేల గజాల మధ్యలో ప్లాట్లు 9, 20 వేల గజాల నుంచి 24 వేల గజాల ప్లాట్లు 6, 25 వేల గజాల పాట్లు 10 ఉన్నాయి.
ఈ 10లో రెండు దేవాదాయశాఖకు చెందినవి కాగా, మూడు ప్లాట్లు ఒకరివే ఉన్నాయి. ఇటీవల నాలుగు వేల గజాల ప్లాట్లు ఒకటీ ఆరా కలిశాయి. ప్రస్తుతం రైతులు కొద్ది మంది తమ ప్లాట్లు అమ్మకానికి వీలు కావడం లేదని, విడగొట్టాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
అయితే అధికారులు మాత్రం ఇలా విడగొట్టుకుంటూ పోతే మాస్టర్ ప్లాను ఇబ్బందులొస్తాయని, ఒకవేళ ఇంటి నిర్మాణంలో అత్యవసరం అనుకుంటే ఒకటీ రెండు ప్లాట్లు కలిపినా ఇబ్బంది ఉండదని తెలిపినట్లు తెలిసింది. పెద్దప్లాట్లు ఉండే ప్రాంతంలో రోడ్ల విస్తీర్ణం, జోనింగ్ రెగ్యులేషన్లు వేరుగా ఉన్నాయని, అక్కడ చిన్నప్లాట్లు వేస్తే మొత్తం వ్యవస్థలో మార్పులు చేయాల్సి వస్తుందని, మాస్టర్ ప్లాను ఆమలు వీలుకాదని తెలిపినట్లు సమాచారం.
Bఅదే సమయంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే పెద్ద ప్లాట్లను 4800, 2400 గజాల వరకు విభజనకు అవకాశం ఇవ్వాలనే కోణంలో పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
– వల్లభనేని సురేష్
(అమరావతి రాజధాని సమగ్ర అధ్యయనవేత్త, విశ్లేషణ నిపుణులు)
9010099208