– టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ
కమలాపురం, (జూ న్ 2): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మాజీ శాసనమండలి సభ్యులు టిడి జనార్థన్ పై తెలుగు దేశం పార్టీ లో ఉండి రాజీనామా చేసిన మహిళా నాయకురాలు దివ్య వాణి వ్యాఖ్యలు సరి కావని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు. కమలాపురంలో గురువారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఒంగోలులో జరిగిన మహానాడు కార్యక్రమంలో దివ్యవాణిని వేదికపై మాట్లాడించ లేదని నిస్వార్థంగా తెలుగు దేశం పార్టీ కి ఎన్నో సేవలు చేస్తూ పార్టీ కష్టకాలం లో ఉన్నప్పుడు తన వంతుగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్థైర్యం నింపి భరోసా ఇచ్చి పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తున్న టి డి జరార్ధన్ వల్ల తనకు పార్టీ లో ప్రాధాన్యత తగ్గిపోయిందని దివ్యవాణి పేర్కొనడం చాలా శోచనీయమన్నారు. రాష్ట్రం లో తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో తోడుగా ఉండి వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి వారి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి పోలీసుల కేసులు పెట్టించుకున్న వారికి కూడ అక్కడ వేదిక పై ఉన్న పరిస్థితుల కారణంగా మాట్లాడడానికి వీలు పడుండక పోయి ఉండవచ్చునన్నారు. దానికి టి డి జనార్ధన్ ను బాధ్యుడిని చేయడం ఆమెకు ఏ మాత్రం తగదన్నారు.
దివ్యవాణి కి సినిమా యాక్టర్ అనే ఒక అర్హత తప్పితే రాష్ట్రంలో ఎక్కడైనా పార్టీ కి సంబందించి కానీ, సొంతంగా కానీ ఒక వార్డ్ మెంబర్ ను అయినా గెలిపించుకునే సత్తా ఉందా అని ప్రశ్నించారు. దివ్యవాణి చెబితే ఆమె ప్రసంగం వింటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎక్కడ ఓట్లు పడే అవకాశం లేదన్నారు. తాము కూడ కడప లో సీఎం సొంత జిల్లాలో ఉంటూ వైసీపీ పై ఆ పార్టీ అధికారం లోకి వచ్చినప్పటినుంచి ఆ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల పై తాము నిరంతరం పోరాటం చేస్తూ పోలీసు కేసులు పెట్టించుకొని పార్టీ కోసం కష్టపడుతూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నా తాము ఎప్పుడు ఇలా దివ్యవాణి లాగా ఫీల్ కాలేదన్నారు. పార్టీ అధికార ప్రతినిధి స్థాయిలో ఆమెను కూర్చో పెట్టీ విశేష మైనా ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
ఇలా స్ధాయిని మరచి పార్టీ పైన, టి డి జనార్థన్ పైన విమర్శలు చేసిన దివ్య వాణి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. వైసీపీ పార్టీ కి సీఎం కు వ్యతిరేకంగా ఆమె చేసిన ఒక పెద్ద ఆందోళన కార్యక్రమం ఒకటైన ఉందా అని ఆయన ప్రశ్నించారు. మహానాడు లో అన్ని లక్షల జనాభ వచ్చినప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం సహజమని వాటిని మంచి మనసుతో స్వీక రించి చంద్ర బాబు నాయుడు కు బాసటగా నిలబడినప్పుడు నిజమైన పార్టీ కార్యకర్త గా అర్థం ఉంటుందన్నారు.