Suryaa.co.in

Andhra Pradesh

రాజకీయ క్రీడల్లో దళితులను బలి చెయ్యొద్దు …

– కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం

సీఎం జగన్‌ రాజ్యాంగాన్ని గౌరవించి కోడి కత్తి కేసులో కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప అండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ఈ కేసులో పూర్తి విచారణ పూర్తయిందని, ఇంకా విచారణ అవసరం లేదని ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపిన దృష్ట్యా కేసు ట్రయల్‌ ముగిసేంత వరకు నిందితుడ్ని బెయిల్‌పై వెంటనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్‌ కోరుతున్నది.

ఈ ఘటనలో కుట్ర జరిగి ఉంటే ఎవరు చేశారు? ఎందుకు చేయించారన్నది ఎన్‌ఐఏ బట్టబయలు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ కేసులో నిందితుడు దళితుడు జనపల్లి శ్రీనివాసరావు అయిదేళ్లుగా బెయిల్‌ రాక రిమాండ్‌ ఖైదీగా జైల్లో మగ్గుతున్నాడని గుర్తు చేశారు. ‘హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ వైసిపి నాయకులు అనంతబాబు తన డ్రైవర్‌ దళితుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయ్యడమే కాకుండ ఇంటికి డోర్‌ డెలివరీ చేసి ఏలాంటి శిక్ష లేకుండ దర్జాగా బయట ఉండి సియం బస్సులో తిరుగుతుంటే, అమాయకుడైన శ్రీనివాసరావు అయిదేళ్లుగా జైల్లో ఉండాలా ?

మళ్లీ మళ్లీ దర్యాప్తు కోరడం వెనుక నిందితుడ్ని శాశ్వతంగా జైల్లో ఉంచాలన్న కుట్ర దాగి ఉంది. రాజకీయ క్రీడల్లో దళితులను బలి పశువులను చెయ్యొద్దని వెంటనే స్టేషన్‌ కి హజరై శ్రీనివాసరావు బెయిల్‌ వచ్చేందుకు దోహదం పడాలని కోరుతున్నాము..

LEAVE A RESPONSE