– వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారు?
– ఆ భూములోకి తరలించిన గ్రావెల్, మట్టి, కంకరను వెంటనే తొలగించాలి
– ఇప్పటికే లీజు మొత్తాన్ని చెల్లించిన విజయవాడ ఉత్సవ్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు
– విజయవాడ ఉత్సవ్ నిర్వహకులకు హైకోర్టులో ఎదురుదెబ్బ
అమరావతి: విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై, హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌పై న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది.
వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించిన హైకోర్టు.. ఆ భూములోకి తరలించిన గ్రావెల్, మట్టి, కంకరను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఆ భూములను యథాస్థితికి తీసుకురావాలని ఆదేశించింది. అయితే దేవదాయశాఖ ఈ భూములను ఇప్పటికే 56రోజుల లీజుకు ఇచ్చింది . ఇప్పటికే ఈ లీజు మొత్తాన్ని విజయవాడ ఉత్సవ్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు, గొడుగుపేట దేవస్థానానికి చెల్లించారు.