Home » గవర్నమెంట్ డబ్బులతో కాకుండా సొంత డబ్బులతో చేస్తారా?

గవర్నమెంట్ డబ్బులతో కాకుండా సొంత డబ్బులతో చేస్తారా?

– సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలనుంచి ప్రజలన తప్పుదోవ పట్టించేందుకే ఫేక్‌ న్యూస్‌
– జగన్ కి మొత్తం 196 మంది సెక్యూరిటీ ఉంటే 986 మంది అని ఎలా రాస్తారు?
– చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయనతోపాటు లోకేష్‌, భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాన్ష్‌లకు సెక్యూరిటీ ఇవ్వలేదా?
– దేవాన్ష్‌కు నలుగురితో సెక్యూరిటీ ఇవ్వలేదా?
– భద్రత గురించి కాబట్టే.. అప్పుడు ఎవ్వరూ ప్రశ్నించలేదు.
– మరి ఇప్పుడు జగన్‌ భద్రతపై ఇంత విషప్రచారం ఎందుకు చేస్తున్నారు?
– పార్టీ ఆఫీసులకు స్ధలాలు ఇవ్వాలని జీవో ఇచ్చింది చంద్రబాబే
జగన్ తాడేపల్లిలోనే ఉండి రాజకీయాలు చేస్తారు
– మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

తాడేపల్లి: సీఎం ప్రాణాలు కాపాడటానికి గవర్నమెంట్ డబ్బులతో కాకుండా సొంత డబ్బులతో చేస్తారా? మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సెక్యూరిటీపై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలనుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఫేక్‌ న్యూస్‌ను సృష్టిస్తున్నారు.

జగన్ కి మొత్తం 196 మంది సెక్యూరిటీ ఉంటే 986 మంది అని ఎలా రాస్తారని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయనతోపాటు లోకేష్‌, భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాన్ష్‌లకు సెక్యూరిటీ ఇవ్వలేదా? దేవాన్ష్‌కు నలుగురితో సెక్యూరిటీ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. భద్రత గురించి కాబట్టే.. అప్పుడు ఎవ్వరూ ప్రశ్నించలేదని నాని చెప్పారు. మరి ఇప్పుడు జగన్‌ భద్రతపై ఇంత విషప్రచారం ఎందుకు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ తాడేపల్లి నివాసంమీదా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.

పార్టీ ఆఫీసులకు స్ధలాలు ఇవ్వాలని జీవో ఇచ్చింది చంద్రబాబేనని గుర్తుచేశారు. 33 ఏళ్ల లీజు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, 99 ఏళ్లు లీజుకు పెంచుకున్నారన్నారు. టీడీపీ కట్టుకున్న ఆఫీసులు పూరిపాకలు, గుడిసెలు కాదుకదా? అని ఎద్దేవా చేశారు. మీలా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చుకున్న వారితో మేం ఆఫీసులు కట్టించుకోలేదని, పార్టీ డబ్బుతో కట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, మాజీగా ఉన్న సమయంలోనూ ఎంత మంది సెక్యూరిటీ ఉన్నారు? వారి జీతాలు ఎంత? బయటపెట్టాలని సవాల్ విసిరారు. సుమారు 1800 నుంచి 2000 మంది సెక్యూరిటీని నియమించుకోలేదా? అని ప్రశ్నించారు.

జగన్ సెక్యూరిటీ మొత్తం 196 మంది మాత్రమే
వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి కి.. సివిల్ పోలీసులకు సంబంధించి సీఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు 18 మంది ఉంటారని పేర్ని నాని వెల్లడించారు. ఆర్మ్ డ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది, జగన్ మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఎప్పుడు బయటకు వచ్చినా బ్లాక్ డ్రెస్ లో ఉండే ఆక్టోపస్ కు సంబంధించిన 13 మంది, సీఎం ఇంటి సరిహద్దుల్లో 23 మంది, సీఎం గారి కాన్వాయ్ 21 మంది, మొత్తం 196 మంది సీఎం తో ఉండే సిబ్బంది అని, ఆయనకు కేటాయించిన మేరకు ఉన్నారని స్పష్టం చేశారు. వీళ్లు తప్ప ఇంకెక్కడైనా, ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.

సీఎంగా ఉండగా జగన్ కి బెంగళూరులో సెక్యూరిటీ లేదని, ప్రభుత్వంలో ఉన్నవారు వాకబు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద లోటస్ పాండ్ లో ఆక్రమణలు కొట్టేశారని కొన్ని వార్తలు రాశారని, సీఎం గారికి, ఆక్రమణలకు ఏం పని? అని ప్రశ్నించారు. సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు ఆఫ్ డ్యూటీలో ఉన్న వారు పడుకోవడానికి తాత్కాలికంగా ఫుట్ పాత్ మీద రేకుల షెడ్లు నిర్మించారన్నారు.

ఈ తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి. ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య ఇళ్ల వద్ద కూడా కట్టారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్లు తాత్కాలికంగా బ్యారెక్స్ కట్టారు. పోలీసులు ప్రతి 3 గంటలకోసారి మారుతారు కాబట్టి పడుకోవడానికి కట్టారని గుర్తు చేశారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు. కమిషనర్ గారికి చెప్పారు, పడేశారని చెప్పారు. దానితో జగన్ కి ఏం సంబంధం? అని నిలదీశారు.

చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 దాకా సెక్యూరిటీకి జీతాలు ఎంత అయ్యాయి? మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర, చంద్రబాబు నాయుడు ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో, ఇంటి వెనుకవైపు, భవానీ ఐల్యాండ్, ఇంటి పక్కన, మదీనాగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్ మీ రాజ మహల్, చంద్రబాబు చుట్టూ ఎంత మంది పోలీసులు ఉంటున్నారు? ఏపీ పోలీసులు కాకుండా నేషనల్ సెక్యూరిటీ సిబ్బంది ఎంత మంది ఉన్నారు? అన్ని చోట్లా ఎంత మంది ఉన్నారో లెక్క చెప్పండని సవాల్ విసిరారు.

2014 నుంచి 2019 దాకా ఎక్కడెక్కడ ఎంత మంది పోలీసులను వాడారు? సుమారుగా 1800 నుంచి 2000 మంది పోలీసులను వాడారు కదా? అని ప్రశ్నించారు. ఉండటం తప్పు అనిగానీ తాను అనటం లేదన్నారు. చంద్రబాబు నాయుడు వి, లోకేష్ వి, లోకేష్ భార్యవి, అబ్బాయివి, చంద్రబాబు నాయుడు శ్రీమతి గారివే ప్రాణాలు.. జగన్ మోహన్ రెడ్డి వి ప్రాణాలు కాదా? అని నిలదీశారు.

ఉండవల్లిలో లోటస్ హోటల్ నుంచి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం మీదుగా కరకట్ట రోడ్డు మొత్తం ట్రాఫిక్ జడ్జిలను తప్ప ఎవరినైనా వెళ్లనిచ్చేవారా? ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అటు దారి లేదు కదా? అని ప్రశ్నించారు. మందడం, వైకుంఠపురం, కృష్ణాయపాలెం ఊర్లకు లోపలి నుంచి చుట్టూ తిరిగి రావాల్సిందే కదా అని గుర్తు చేశారు. మొత్తం 13 కిలోమీటర్లు రోడ్డు మూశారా? లేదా? అని ప్రశ్నించారు. సీఎం నివాసం ఉంటున్నప్పుడు సెక్యూరిటీ రివ్యూలో ఏ రోడ్డు బ్లాక్ చేయాలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

21.07.2016న జీవో నంబర్ 340ని చంద్రబాబు గారు తెచ్చారని, పార్టీ ఆఫీసులకు స్థలాలిచ్చిన ఆనవాయితీని తెచ్చామన్నారని గుర్తు చేశారు. అందులో కేటగిరీల వారీగా జాతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ఎవరికైతే 50 శాతం తగ్గకుండా శాసనసభలో సభ్యులున్నారో వాళ్ల కేంద్ర కార్యాలయం కట్టుకోవడానికి 4 ఎకరాలు కేటాయించవచ్చన్నారని తెలిపారు. ఆ సంఖ్య 25 శాతం పైన ఉంటే ఆ పొలిటికల్ పార్టీకి అర ఎకరం, 25 శాతం లోపు ఉండి ఒక్క సభ్యుడైనా ఉంటే 1000 గజాలు, అలాగే జిల్లా కేంద్రాల్లోనూ స్థలాలు ఇవ్వొచ్చని పేర్కొన్నట్లు తెలిపారు.

ఈ జీవోను ఆధారం చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి 2019లోపు 10 జిల్లాల్లో ఆఫీసులు కేటాయించుకున్నారని పేర్ని నాని గుర్తు చేశారు. వైయస్సార్ కడప, శ్రీకాకుళం, మంగళగిరి, విజయనగరం, చిలకలూరిపేట, గుంటూరు, విజయవాడ, ప్రకాశం, చిత్తూరు కాకినాడ, నెల్లూరు, ఏలూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో స్థలాలు తీసుకున్నారని, 33 ఏళ్లకు మించి ఇవ్వకూడదని జీవో వాళ్లే ఇచ్చి, 99 ఏళ్లకు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.

తాడేపల్లి లో జగన్ మోహన్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల అపార్ట్ మెంట్లు ఉన్నాయి కాబట్టి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేశారని పేర్ని నాని వివరించారు. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచే వరకు తాడేపల్లిలోనే ఉండి రాజకీయాలు చేస్తారని స్పష్టం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని సవాల్ విసిరారు. భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతంలో 5వ పెద్ద పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్ తగ్గుతాడా? తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీస్తేనే భయపడనివాడు ఇప్పుడెలా భయపడతాడు? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 65 శాతం మంది చూసే టీవీ9, ఎన్టీవీ, సాక్షి టీవీలను కేబుల్ చానళ్లలో నిషేధించారని మండిపడ్డారు. మొత్తం 15 మంది ఎంఎస్ఓలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఏ నంబర్లలో అంతకు ముందు వచ్చాయో అదే స్థానంలో ప్రసారం చేయాలని జడ్జిమెంట్ వచ్చిందన్నారు. ప్రసారం చేయకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు.

Leave a Reply