Suryaa.co.in

Andhra Pradesh

ఆదాని డిస్టలరీస్ కి, విజయసాయికి సంబంధం లేదని చెప్పే ధైర్యముందా?

– అల్లుడి బ్రదర్ని అప్రూవర్ గా మార్చినవాడివి. అప్రూవర్ గా మారవని గ్యారంటీ ఏంటి విజయసాయి?
-అవినీతి ఘనాపాటి విజయసాయి చంద్రబాబు గురించి మాట్లాడటం తప్పు
– రాష్ట్రంలో పులిలా వ్యవహరిస్తూ.. ఢిల్లీలో పిల్లిలా మారే విజయసాయి అవినీతి చరిత్ర అందరికీ తెలిసిందే
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

రాష్ట్రంలో పులిలా వ్యవహరిస్తూ.. ఢిల్లీలో పిల్లిలా మారే విజయసాయి అవినీతి చరిత్ర అందరికీ తెలిసిందేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు

ఏ2 విజయసాయిరెడ్డి గురివింద గింజ లాంటివాడు. విజయసాయి చరిత్ర అంతా అవినీతిమయం. ఏ1 అంటే జగన్మోహన్ రెడ్డి, ఏ2 అంటే విజయసాయిరెడ్డి అని రాష్ట్రంలోని అందరికీ అర్థమైపోతుంది. సీబీఐ 11 కేసుల్లో విజయసాయిపై చార్జిషీట్ వేసిన మాట అందరికీ తెలిసిందే. విజయసాయి అవినీతి సామ్రాట్ పరుడని చట్టాలు కూడా చెప్పాయి. ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సబబు?. అదృష్టం కలిసొచ్చి కోట్లకు పడిగెలెత్తావు, ఆ కోట్లతో తిని, తాగి తందానాలాడాలిగానీ.. ఏ తప్పు చేయని, అవినీతి వైపు కన్నెత్తి చూడని చంద్రబాబుపై అవకాకులు చవాకులు పేల్చడం కరెక్టు కాదు.

అదృష్టం కలిసి రావడంతో ఎంపీ అయినంతమాత్రాన ఇలాంటి వ్యవహారశైలా?. కోట్లకు పడిగెలెత్తావు.. ఎలా సంపాదించావు?. ఏతప్పు చేయని, ఏ చిన్న అవినీతికి పాల్పడని చంద్రబాబు గురించి మాట్లాడటం సరికాదు. అవినీతి చక్రవర్తి. ఆదాని డిస్టలరీస్ కి, విజయసాయికి సంబంధం లేదని చెప్పే ధైర్యముందా? అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి కి బెయిల్ ఎలా వచ్చింది? అతన్ని అప్రూవర్ గా మార్చిందెవరో తెలియాలి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విజయసాయికి వార్నింగ్ ఇచ్చిన మాట నిజంకాదా?

ఇంకోసారి డిల్లీ లిక్కర్ స్కామ్ లో నీవు చొరవ తీసుకుంటే నీకు సినిమా చూపిస్తామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విజయసాయికి వార్నింగ్ ఇచ్చింది. ఆరోజు నుంచి నీ ఫోన్లపై నిఘా ఉంచడంతో నీవు ఫోన్లు మార్చుకొని తిరుగుతున్న మాట వాస్తవం కాదా? శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపేటప్పుడే విజయసాయి ఫోన్ పోవడంలో మతలబేంటో ఒకసారి ఆలోచించాలి. లక్కర్ స్కామ్ కి విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఆ ఫోన్ ద్వారా బయటపడుతుందనే ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు.

బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శిస్తూ మధ్యలో చంద్రబాబును లాగడమెందుకు?
బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ట్వీట్ చేస్తూ మధ్యలో చంద్రబాబును తీసుకురావడమేంటి?. ఢిల్లీలో బీజేపీ వారివద్ద బక్కచిక్కిన పిల్లిలా వ్యవహరిస్తారు, వంగి వంగి దండాలు పెడతారు, నీ బాంచన్ దొర కాల్మొక్తా అంటారు రాష్ట్రానికొచ్చి బీజేపీ పట్ల పులిలా మాట్లాడుతావు. ధైర్యముంటే బీజేపీతో, మోడీ, అమిత్ షాతో ఛాలెంజ్ చేయాలి. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రికాకముందు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉండేవారో ఒకసారి ఆలోచించుకోవాలి.

చెన్నైలో మౌంట్ రోడ్ లో చిన్న ఆఫీసు పెట్టుకుని ఉండేవాడని అందరికీ తెలుసు. నేను మీలా సభ్యతా, సంస్కారం లేనివాడిని కాదు. విజయసాయి ఆదాయం లక్ష కోట్లు దాటి ఉంటాయి. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి. -సీబీఐ 11 కేసుల్లో విజయసాయిపై చార్జిషీట్ వేసిన మాట వాస్తవంకాదా? ఎన్ని ఆడిటింగ్ లు చేస్తే, ఎన్ని ఇన్ కమ్ ట్యాక్స్ వారికి రిపోర్టులు తయారు చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి? అలాంటిది సులభంగా సంపాదించే మార్గాలు వెతుక్కున్నావు.

విజయసాయి సాక్ష్యులను ప్రభావిం చేయడంలో దిట్ట
విజయసాయిరెడ్డి పెద్ద మ్యానిపులేటెర్. తిమ్మిని బొమ్మిని చేయడం, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయడం విజయసాయికి వెన్నతో పెట్టిన విద్య. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి కి బెయిల్ రావడానికి, అతను అప్రూవర్ గా మారడంలో విజయసాయి హస్తం ఉంది.. కాకపోతే అతన్ని అప్రూవర్ గా అంగీకరించారు. పదే పదే ఢిల్లీ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి తరపున మాట్లాడితే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ మీకు వార్నింగ్ ఇవ్వడం నిజంకాదా?.

నీవు అవినీతిపరుడు కాకపోతే శరత్ చంద్రారెడ్డి అరెస్టు వెంటనే మీ సెల్ ఫోన్ ఎలా పోతుంది?, ఎందుకు హడావిడిగా ఫోన్ పోయిందని పోలీసులతో కేసు రిజిష్ట్రర్ చేయించావు?. లిక్కర్ స్కామ్ కి విజయసాయికి సంబంధం బహిర్గతమౌతుందనే ఫోన్ పోయిందని నాటకమాడారు.

ఇటీవల ఆస్తుల పెంపుదలపై జగన్ విజయసాయికి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా?
ఇటీవల మీ ఆస్తుల పెంపుదలపై జగన్ వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా?. విజయసాయి అవినీతిపరుడు కాకపోతే రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ గా పేరు ఎందుకు తొలగించారు? అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించే విజయసాయిరెడ్డిలాంటివారిని ఇంటికి పంపడానికి జనం ఎదురుచూస్తున్నారు. ముందుంది ముసళ్లపండుగ.

అల్లుడి బ్రదర్ని అప్రూవర్ గా మార్చినవాడివి. విజయసాయి అప్రూవర్ గా మారవని గ్యారంటీ ఏంటి? నీవు కూడా అప్రూవర్ గా మారుతావు. జగన్ కు ఇష్టమున్నా, లేకపోయినా ప్యాంపర్ చేస్తున్నారు. చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు విజయసాయికి లేదు. బీజేపీ గురించి, పురందేశ్వరి గురించి మాట్లాడదలచుకుంటే ధైర్యంగా ఢిల్లీలోనే మాట్లాడాలిగానీ చంద్రబాబును ఇన్వాల్ చేయడం మంచిది కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు.

LEAVE A RESPONSE