Suryaa.co.in

Andhra Pradesh

పొట్టి శ్రీరాములు గారిని అవమానిస్తారా?

– ట్విట్టర్ లో మాజీ మంత్రి అయన్నపాత్రుడు…
పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్ప‌ణ‌తో ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుతున్న ప్ర‌భుత్వం..అమ‌ర‌జీవికి ఓ దండ‌వేసి చేతులు దులుపుకోవ‌డం ఆ మ‌హ‌నీయుని త్యాగాల‌ను అవ‌మానించ‌డ‌మే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ‌తో ఏ సంబంధ‌మూలేని మీ తండ్రి వైఎస్సార్ గారి పేరుపెట్టి ఈ రోజు పుర‌స్కారాల కార్యక్రమం నిర్వహించడం త‌ప్పు జ‌గ‌న్‌రెడ్డి గారూ. మ‌న రాష్ట్ర అవ‌త‌ర‌ణ కోసం త‌న ప్రాణాల్నే తృణ‌ప్రాయంగా వ‌దిలేసిన పొట్టిశ్రీరాములు త్యాగాన్ని అప‌హాస్యం చేసేలా మీరు నిర్వ‌హించిన స‌భ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ వేడుకా? వైఎస్సార్ గారి జయంతి లేదా వర్థంతి సందర్భంగా ఆయన పేరుతో అవార్డులు ఇచ్చుకుంటే తప్పులేదు కానీ ఈ రోజు పొట్టిశ్రీరాములు గారి పేరుతో కాకుండా వైఎస్సార్ పేరుతో పురస్కారాలు ఇవ్వడం దారుణం.

LEAVE A RESPONSE