– ఫాంహౌజ్ కేసు విచారణను సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నాం
– సెస్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అక్రమాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం
5 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలను తారు మారు చేస్తారా? సెస్ ను నాశనం చేసిన టీఆర్ఎస్ కు ఓట్లేయలేదేనే అక్కసుతో ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తారా?టీఆర్ఎసోళ్లే ఓట్లేసుకుంటున్నారు… వాళ్లే ఫలితాలను ప్రకటించుకుంటున్నారు?ఇంతదానికి ఎన్నికలెందుకు? ఫలితాలు ప్రకటించడమెందుకు? ప్రజల సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమెందుకు?
అధికారం టీఆర్ఎస్ చేతుల్లో ఉంది కదా ఇష్టానుసారం వ్యవహరిస్తారా?టీఆర్ఎస్ నేతల తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు . సాధారణ ఎన్నికల్లో మీ ఆటలు చెల్లవు… ప్రజలు కేసీఆర్ చెంప చెళ్లమన్పించేందుకు ఎప్పుడో సిద్ధమయ్యారు
నలుగురు ఎమ్మెల్యేల ఫాంహౌజ్ కేసు విచారణను హైకోర్టు ధర్మాసనం సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నాం.ఈ కేసులో వాస్తవాలన్నీ బయటకు రావాలని బీజేపీ కోరుకుంటోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను దాచి పెట్టి అసత్య ప్రచారంతో బీజేపీని బదనాం చేసే కుట్రకు తెరదీసింది.ఫాంహౌజ్ కేసులో కర్త, కర్మ, క్రియ ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆరే. కథ, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ కు ‘ప్రగతి భవన్’ అడ్డగా మారింది. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. నేరస్తులను కాపాడటానికే ‘సిట్’ విచారణ సాగుతున్నట్లుగా కన్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక కేసులపై ‘సిట్’ విచారణ జరిపినా కనీసం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోవడమే ఇందుకు నిదర్శనం.
అభివ్రుద్ది గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. లిక్కర్, డ్రగ్స్, అవినీతి కేసుల్లో నిండా కూరుకుపోయిన తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు, ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి కేసీఆర్ అల్లిన కట్టుకథ ఫాంహౌజ్ కేసు. ఫాంహౌజ్ కేసులో దోషులెవరో గుర్తించడానికే సీబీఐ విచారణ అవసరమని ప్రజలు కోరుతున్నారు. సీబీఐ విచారణతో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని బీజేపీ భావిస్తోంది..