– రైతులు- ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య అనుమానాల నివృతి కార్యక్రమం
రైతులతో సమావేశం ప్రారంభమైన వెంటనే రాజధానుల అవసరాలు ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు వివరించారు విజయవాడ నుండి కర్నూలు హైదరాబాదు రాజధాని ఎలా మార్పు చెందింది అనే అంశాలను వివరించారు. అనంతరం రైతులు ముఖ్యమంత్రి మధ్య అనుమానాల నివృతి కార్యక్రమం సలహాలు సందేహాలు అంశాల మీద చర్చ జరిగింది రాజధాని విస్తరణకు భూమి కావలసి ఉంది.
పూలింగ్ కు వెళ్ళమంటారా మున్సిపాలిటీగా ఉంటారా మీరే చెప్పండని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను ఉద్దేశించి అన్నారు దీనికి ఓ రైతు లేచి పూలింగులో గతంలో ఇచ్చిన హామీని నెరవేరిస్తే తర్వాత ఎంత విస్తరించిననా అభ్యంతరం లేదని తెలిపారు మీ మీద నమ్మకం ఉందని అన్నారు ఇంతలో మరో రైతు లేచి ఓ అభ్యంతరం వ్యక్తం చేయబోగా స్పందించిన ముఖ్యమంత్రి.. మీరు అవునన్నా కాదన్నా రాజధాని నిర్మాణాన్ని విస్తరించాల్సిందే పెద్ద రాజధానిగా మార్పు చేయాల్సిందే తప్ప దాని గురించి మరో ఆలోచన లేదు అన్నారు దీనిపై మరో రైతు లేచి.. విస్తరణకు వెళ్లే ముందు రాజధాని ప్రాంతంలో ఇప్పటికే భూసేకరణ చేయాల్సి ఉందని, భూసేకరణకు సంబంధించి మరలా నోటిఫికేషన్ తయారు చేశారని పూలింగ్ కూడా వేగవంతం చేస్తారని తెలిపారు.
ఏది ఏమైనా అమరావతి రాజధాని పెద్ద రాజధానిగా నిర్మించి తీరుతామని వెనక్కు తగ్గే లేదని అన్నారు ఇంకో రైతు లేచి ఎఫ్ ఎస్ ఐ పెంచాలని కోరారు. ఎస్ఎఫ్ఐ పెంచడం లేదా అనేది అధికారులు నిర్ధారిస్తారని సీఎం చెప్పారు అయితే జరీబుమెట్ట భూ సమస్య మీద ముగ్గురు అధికారులతో కమిటీ వేసామని వారు పరిష్కరిస్తారని తెలిపారు అయితే అర్హత లేకుండా భూమి పొందిన వారిని తీసేయమంటారా అర్హత ఉండి కోల్పోయిన వారికి కలపమంటారా అర్హతను ఎలా నిర్ణయించాలి మీకు అర్థం కావాలి.
అందుకే ఇప్పటికే దీనిపై అధికారులతో కమిటీ విచారణలు జరిపింది. మరో ముగ్గురు అధికారులు కూడా దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేస్తారు. దాని ఆధారంగా జరీబుమెట్ట సమస్యను పరిష్కరిస్తాం అన్నారు. దీనిపై ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనగా ఓ రైతు లేచి.. అర్హత ఉన్నవారికి ఇవ్వండి లేనివారికి తీసేయండి అని చెప్పారు అలాగే గ్రామ కంటాల సమస్యను పరిష్కరించాలని ఇద్దరు రైతులు ముఖ్యమంత్రి ముందు లేవనెత్తారు.
దీనికి స్పందించిన సీఎం గతంలో గ్రామకంటాలు ఇచ్చిన సమయంలో ఒక పద్ధతి పాటించారని అందులో కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చు అయితే వాటిని సరిచేస్తున్నామని చెప్పారు దీనివల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు అనేది తన అభిప్రాయం అని పేర్కొన్నారు. అయితే మీకు నేను హామీ ఇస్తున్నా రాజధానిని అభివృద్ధి చేస్తాను లేకపోతే మున్సిపాలిటీగా ఉండిపోతుంది. పూలింగ్ సమయంలో నాపై నమ్మకం ఉంచారు. అందరికి న్యాయం చేస్తాను వెనకాడను.
మరో రైతు లంక భూముల సమస్యలు లేవనెత్తారు..దీనికి సీఎం మాట్లాడుతూ మొత్తం 1100 ఎకరాల లంక భూములకు సంబంధించిన సమస్య ఎన్జీటీలో ఉందని ఇందులో సుమారు 900 ఏకరాలకు ప్లాట్లు ఇచ్చేశారని 250 ఎకరాలకు ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు సరే భూమి ప్రభుత్వానికి అందినా అందకపోయినా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చేస్తామని, ఎన్జీటీ సమస్య పరిష్కారం అయ్యాక ఆ భూముల విషయం ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. క్యాపిటల్ గెయిన్స్ గురించి ఎఫ్ ఎస్ ఐ ఇద్దరు రైతులు సీఎం ముందు ప్రస్తావించారు.
దీనిపై సీఎం మాట్లాడుతూ, కేంద్రమంత్రి ముందు ఈ అంశాన్ని పెడతానని సాధ్యమైనంత త్వరలో మాట్లాడి అది పరిష్కారం అవుతుందో లేదో చెప్తానన్నారు కొనసాగింపు అనేది కూడా కేంద్రం చేతుల్లో ఉందని అన్నారు. ఇక చివరిగా ఇప్పుడున్న జేఏసీ ని కమిటీగా ఏర్పాటు చేయాలని రైతులు ప్రస్తావించగా, మొత్తం వివరాలు సేకరించి అమరావతి అభివృద్ధి ఫెడరేషన్ పేరుతో ఇంకా ఏదైనా మంచి పేరు ఉంటే చూసి ఒక సొసైటీని రిజిస్ట్రేషన్ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ కు సూచించారు మరో రైతు.. గ్రామాల్లో స్మశాన సమస్యను లేవనెత్తారు మల్కాపురం గ్రామంలో స్మశానానికి వెళ్లేందుకు దారి లేదని తెలిపారు.
దీనిపై సీఎం మాట్లాడుతూ అన్ని గ్రామాల్లోనూ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి? పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కి రావడానికి ముందే కేంద్రమంత్రి చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ రైతులతో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ చేశారు అయితే రెండో దశ పూలింగ్‌కు వెళ్లాలని ఓ రైతు చెప్పిన అంశంపై బయటకు వచ్చిన తర్వాత అక్కడ కొంత చర్చ జరిగింది. ఇక పలు అంశాలపై ఓ రైతు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిసింది.
– వల్లభనేని సురేష్ సీనియర్ జర్నలిస్ట్ 9010099208
