Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కు మానవత్వం ఉందా.. అసలు ఇదొక పుటకేనా?

-వైసీపీని పులివెందుల లోనే భూస్థాపితం చేస్తా
– కులాల మత్తు నుంచి జనం బయటకు రావాలి
– బాబాయ్ ను చంపాను అని ఓట్లు అడుగుతారా?
– కుప్పం నియోజకవర్గం పై ప్రభుత్వానికి శీతకన్ను
– ఇక్కడ వేషాలు వేసే వారిని పులివెందుల వరకు తరుముతాం
– కుప్పం నియోజకవర్గం లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

సీఎం జగన్‌ మానవత్వం లేని మనిషి. అసలు ఆయనదొక పుటకేనా? కుప్పంలో పిచ్చివేషాలేస్తే పులివెందుల వరకూ తరిమికొడతతాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకే కుప్పం నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు. నేను పులివెందులకు ఆవిధంగా ఎప్పుడైనా చేశానా? ప్రజలు కులాలమత్తు నుంచి రావాలి. లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు. వైసీపీ వాళ్లు కుల రాజకీయాలు చేసి, ప్రజలను చీలుస్తున్నార’ని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు.

ఆయన తన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం, కొంగణపల్లి, కొల్లుపల్లి లో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే..కుప్పం నియోజకవర్గం పై ప్రభుత్వానికి శీతకన్ను.నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదు.ఈ చేతగాని ప్రభుత్వం… మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చెయ్యలేదు.నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు ఇచ్చాను.నాకు ఓట్లు వేయలేదని నేను పులివెందులలో పనులు నిలిపి వెయ్యలేదు.

కుప్పంలో 100 కోట్లు పేదల ఇళ్లపై ఖర్చు పెట్టాం…వాటిని నిలిపివేశారు.కుప్పం లో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలని 1350 కోట్లు కేటాయించి సగం ఖర్చు చేశాం.కుప్పం కు రావాల్సిన 1350 కోట్ల నిధుల జీవోలు రద్దు చేసి ఇప్పుడు 65 కోట్లు ఇస్తాం అంటున్నారు.డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఉత్తమ విధానానికిncb3 ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాను.మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చాం.వైసీపీ ప్రభుత్వం లో మూడేళ్లలో ఒక్క ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చరా? రాష్ట్రంలో సంక్షేమం కాదు…అందరినీ బాదుడే బాదుడు.300 యూనిట్ల విద్యుత్ వాడితే అమ్మఒడి పథకం కట్.టాక్సీ ఉన్నా పథకాలు తీసేస్తున్నారు.మన నియోజకవర్గం లో కొందరు రౌడీ ఇజం చేస్తున్నారు.ఇక్కడ వేషాలు వేసే వారిని పులివెందుల వరకు తరుముతాం.

నా పర్యటనకు కావాలని అడ్డంకులు సృష్టిస్తారా? పోలీసులు న్యాయం గా ఉండాలి….మాట్లాడితే FIR పెడుతున్నారు. పద్దతి మార్చుకోవాలి.వైసీపీ కి చెందిన దొంగలు, రౌడీ లు గుర్తు పెట్టుకోవాలి. అందరి ఆటలు కట్టిస్తాం.టీడీపీ మద్దతు దారులకు పెన్షన్ లు, పథకాలు నిలిపివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయం చేస్తాం.నిలిపివేసిన పథకాలు వడ్డీ తో సహా ఇప్పిస్తాం. అందరూ పన్నులు కడుతున్నారు….ఇదేమి జగన్ సొంత సొమ్ము కాదు.

కుప్పంలో పథకాలు ఎందుకు నిలిపి వేస్తున్నారు?టీడీపీ ఓడిన ప్రతి సారి కుప్పం పై అయా ప్రభుత్వాల వివక్ష.రాజకీయం వేరు…అభివృద్ధి వేరు అని నేను ఆలోచించాను.అందుకే పులివెందులకు నీళ్ళు ఇచ్చాను.వైసీపీ ని పులివెందుల లోనే భూస్థాపితం చేస్తాను.పంచాయతీ ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచాం అని పుంగనూరు పుడింగి ఇక్కడ హడావుడి చేస్తున్నారు.

ఏమి చేశారని ప్రజలను జగన్ ఓట్లు అడుగుతారు.బాబాయ్ ను చంపాను అని ఓట్లు అడుగుతారా?నేను పులివెందులను కుప్పం లా అభివృద్ధి చేద్ధాము అనుకున్నా. మీరు కుప్పాన్ని పులివెందుల చెయ్యాలి అనుకుంటున్నారు. ఒకరిద్దరు రౌడీఇజం చేస్తే టీడీపీ భయపడదు. వైసీపీ 175 గెలవడం కాదు….ఈ సారి పులివెందుల కూడా ఓడిపోతారు.YSR CM గా ఉన్నప్పుడు లేపాక్షి హబ్ పేరుతో ఇందు అనే సంస్థకుncb 8500 ఎకరాలు ఇచ్చారు.ఇందులో అక్రమాలు జరిగాయి అని జగన్ జైలుకు కూడా వెళ్ళాడు.ఇప్పుడు ఆ కంపెనీ దివాలా తీసిందని ఆ భూములు కొట్టేసే పరిస్థితి కి వచ్చారు.వాలా పేరుతో 500 కోట్లు ఇచ్చి 9 నుంచి 18 వేల కోట్ల విలువైన భూములు కొట్టేస్తున్నారు. జగన్ మేనమామ కొడుకే ఈ భూములు కొట్టేస్తునారు.పోరాటాలు చేసిన టీడీపీ పులివెందుల పిల్లికి భయపడదు.పులివెందులలో జగన్ చెడబుట్టాడు…ప్రజలకు గౌరవం తెచ్చేలా నాయకుడు ఉండాలి.ప్రశాంతతకు మారు పేరైన కుప్పం లో డ్రామాలు మొదలు పెట్టారు.10 మంది రౌడీ లను మద్యం పోసి మాపై పురిగొల్పుతున్నారు.పోలీసులు ఇలా నిర్వీర్యం అయితే ఎలా?

మీ దగ్గర అవినీతి డబ్బు ఉంది…కుప్పానికి ఎన్నికల్లో లారీల్లో డబ్బు పంపుతాడు.అవినీతి డబ్బు మన కుప్పం ప్రజలకు వద్దు.ఒక ఎంపీ బట్టలు విప్పి తిరుగుతుంటే తప్పు అని సీఎం పిలిచి చెప్పాలి.ఎంపీతో సీఎం రాజీనామా చేయించాలి. కానీ ప్రశ్నించిన మాపై కేసులు పెడుతున్నారు.ఇక్కడ గ్రానైట్ దొచేస్తుంటే వెళ్ళడానికి మాకు హక్కు లేదా?కుప్పం లో పోలీసులు మా వాళ్లపై కేసులు పెట్టారు.ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు చెయ్యాలా అని నాకూ అప్పుడప్పుడు అనిపిస్తుంది.కానీ గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అని రాజకీయాల్లో ఉన్నాను…ఉంటాను.

కుప్పంలో ఎంతమంది నా కులం వాళ్ళు ఉన్నారు.నాకు కులం అంటగడతారా?అందుకే కులం పేరు ఎత్తితే చెప్పు చూపించమని చెప్పాను.కులాల మత్తు నుంచి జనం బయటకు రావాలి.జగన్ కు మానవత్వం ఉందా…నెల్లూరు లో దళితుడు ప్రాణం పోయినా స్పందించరా? ఇదొక పుటకేనా?
నెల్లూరులో కుటుంబానికి డబ్బులు ఇచ్చి కేసు సెటిల్మెంట్ చేస్తారా?

LEAVE A RESPONSE