– ఎక్స్ లో హరీష్ రావు
ఆస్పత్రిలో ఉండి, పురిటి నొప్పులు పడుతూ వైద్యుల కోసం గంటల పాటు ఎదురు చూస్తున్న గర్భిణుల ఆవేదన వర్ణనాతీతం.పేరుకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి. కానీ గైనకాలజిస్టు, అనస్తీషియా వైద్యుడు లేని దారుణ పరిస్థితి. పాలన గాలికి వదిలి, అనునిత్యం రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడే ముఖ్యమంత్రి గారికి గర్భిణుల ఆవేదనైనా వినపడుతుందా?తక్షణమే గర్భిణులకు అవసరమైన అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.