-5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వ హయాంలోపోలవరం పనులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
-మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు
5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం డ్యామ్ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, ల్యాండ్ ఎక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ పనులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా?. జగన్, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి కలిసి పోలవరం ప్రాజెక్టుకు దుర్గతి పట్టించారు. వీటితో పాటు టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్ల శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి. ప్రభుత్వం వద్ద అన్ని రికార్డులు సిద్ధంగా ఉంటాయి కావున శ్వేతపత్రం విడుదల చేయడం పెద్ద కష్టమేమీ కాదు. పోలవరం ప్రాజెక్టు అథారిటి మినిట్స్ లో పోలవరం నిర్మాణంలో జరగబోయే అనర్థాలను వివరించారు.. వాటి గురించి మంత్రి రాంబాబు మాట్లాడాలి. రంపచోడవరం నిర్వాసితుల రికార్డులు తారుమారు చేసి కోట్లాది రూపాయలు పందికొక్కుల్లా తిన్నారు. రంపచోడవరంలో నిర్వాసితుల గురించి మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి జాయింట్ కలెక్టర్ కు విన్నవించినా ఫలితం శూన్యం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నాక పోలవరం డ్యామ్ పూర్తవుతుందని ముఖ్యమంత్రి డెడ్ లైన్ ఎలా పెడతారు? ఇలా పెట్టడంలో అర్థంలేదు.
గత మూడునెలలుగా పోలవరం నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీ నాయకత్వంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి పోలవరం నిర్వాసితులు డబ్బులు పందికొక్కుల్లా తిన్నారు. రంపచోడవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి నిరాహార దీక్ష చేసినా పట్టించుకోలేదు. నష్టపోయినవారి వివరాలను స్వయంగా నేనే సంబంధిత ప్రభుత్వ అధికారులకు అందించినా ఫలితం శూన్యం. మంత్రి రాంబాబు చంద్రబాబును విమర్శించడం కాదు పోలవరంపై మాట్లాడాలి. టీడీపీ హయాంలో పోలవరం పట్టిసీమలో ఎటువంటి తప్పిదాలు లేవని, సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ కు అనుగుణంగా, రాష్ట్ర జల వనరుల శాఖలో ఉన్న చట్టాలకు అనుగుణంగా పనులు జరిగాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రే రాష్ట్ర జలవనరుల శాఖకు లేఖ రాశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రే పార్లమెంటు, రాజ్యసభకు చెప్పారు. పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి ఉత్తరం రాస్తే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇదే సమాధానం వచ్చింది. పోలవరం పట్టిసీమలో ఎటువంటి తప్పిదాలు జరగలేదని కేంద్రమే తేల్చింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రోజే పోలవరం పనుల్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. పనులు చేయడానికి స్పిల్ వే, ఎర్త్ రాక్ ఫీల్ డ్యాం పనులు, పవర్ ప్రాజెక్టు పనులు కలిపి అప్ లోడ్ చేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫామ్ లో ఉండగానే జగన్ రెడ్డి పోలవరం నిర్మాణం కోసం వచ్చిన కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు. పోలవరం కాంట్రాక్టర్లతో చర్చలు జరపడం చూసి అందరూ ఆశ్చర్యపోవడం జరిగింది. ఈ పాపం నాకొద్దు అని రోశయ్య పోలవరం పనులను రద్దు చేశారు. మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వాయిదాలు పడి క్యాన్సిల్ అయింది. 2009 నుంచి 2013కి టెండర్లు ఫైల్ అయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాన్స్ అయి 5 సంవత్సరాలు పనులు ఇవ్వబడి సుమారు 3 వేల కోట్లు మళ్లీ ఖర్చు పెరిగింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా అనేక తప్పిదాలు జరిగాయి.గతంలో రెండు సంఘటనలు జరిగాయని, నాలుగు సంవత్సరాలు ప్రాజెక్టు నిర్మాణంలో గడచిపోయాయి, ఇప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆగస్టు 16, 2019లో పీపీఐ సీఈఓ జెయిన్ పోలవరం ప్రాజెక్టు అథారిటి స్పష్టంగా ఇటీవల చెప్పింది. ఇవన్నీ చదవకుండా రాంబాబు ఎప్పటివో మినిట్స్ చదువుతున్నారు. రాంబాబు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. తెలివితక్కువతనంగా మాట్లాడొద్దని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.