గవర్నర్ కు కవిత ఇంటిపై దాడి జరిగినప్పుడు గుర్తు లేదా?

-ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన షర్మిళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
-హైదరాబాద్ లో సీమాంధ్రులు బ్రతకాలంటే పాకిస్థాన్ లో బ్రతికినట్లు అనే వ్యాఖ్యలు చేశారు
-షర్మిల భర్త బ్రదర్ అనిల్ బయ్యారం గనులు కొల్లగొట్టాలని ప్రయత్నం చేశారు
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ఎం. ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్యే నోముల భగత్

గవర్నర్ కు కవిత ఇంటిపై దాడి జరిగినప్పుడు గుర్తు లేదా ? కేసీఆర్ ఆమరణదీక్షతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది.ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన షర్మిళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎంపీల పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.షర్మిల కుటుంబం తెలంగాణ వ్యతిరేక కుటుంబం…తెలంగాణ కు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారు.

నాడు వైఎస్ నంద్యాలలో హైదరాబాద్ కు పోవాలంటే వీసా తీసుకుని పోవాలని అన్నారు.గతంలో షర్మిళ హైదరాబాద్ లో సీమాంధ్రులు బ్రతకాలంటే పాకిస్థాన్ లో బ్రతికినట్లు అనే వ్యాఖ్యలు చేశారు.వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని షర్మిల సందర్భం వచ్చినప్పుడల్లా బయటపెడుతున్నారు.

వైఎస్ సన్నిహితుడు కె.వి.పి.రామచందర్ రావు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజ్యసభలో నిరసన తెలిపారు.తెలంగాణ వ్యతిరేకులు…తెలంగాణకు ఏం చేస్తారు?షర్మిల మాట్లాడే భాష సంస్కార హీనంగా వుంది.షర్మిల మాట్లాడే భాష ఆడబిడ్డ మాట్లాడే విధంగా ఉన్నాయా…?

చెన్నూరులో షర్మిల నాపై వ్యతిరేకంగా మాట్లాడితే మా కార్యకర్తలను నేను సముదాయించాను.వైఎస్ కుటుంబం పై తెలంగాణ ప్రజల్లో కోపం వుంది.తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని షర్మిల భర్త బ్రదర్ అనిల్ బయ్యారం గనులు కొల్లగొట్టాలని ప్రయత్నం చేశారు.హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారు.షర్మిల తన భాష మార్చుకోకపోతే ఏమైనా అయితే మాకు సంబందం లేదు. అసలు దొంగలు ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు…కృష్ణా,గోదావరి నీళ్లను ఆంధ్రకు తరలించింది ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు.

షర్మిలకు తెలంగాణ గురించి ఏం తెలుసు?తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం.కిరాయి మనుషుల తోలుబొమ్మల ఆటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.తెలంగాణ వనరులను దోచుకున్న ఘనత వైఎస్ కుటుంబానిది.నాడు మానుకోటలో జగన్ ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్న చరిత్రను షర్మిల మర్చిపోయారా?

Leave a Reply