Suryaa.co.in

Telangana

గన్ పార్క్ వద్ద ‘‘నిరసన దీక్ష’’ చేసే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేదా?

-కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా
-పేపర్ లీకుల వెనక బోర్డు చైర్మన్ నుంచి మంత్రుల స్థాయి వరకు హస్తం ఉంది
-బండి సంజయ్ సహా బిజెపి నేతలు, కార్యకర్తల అరెస్టును తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్

గన్ పార్క్ వద్ద ‘‘నిరసన దీక్ష’’ చేసే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేదా?టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జి, లేదా సీబీఐతో విచారణ జరిపించాల్సిందే.బాధ్యులైన కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా.కేసీఆర్ సర్కార్ అక్రమార్కులకు పెద్దపీట వేస్తూ… నిరుద్యోగ యువతను నిండా ముంచుతోంది.

33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్నారు33 లక్షల నిరుద్యోగ యువత జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది.పేపర్ లీక్ అనేది పెద్ద స్కాం.పేపర్ లీకుల వెనక బోర్డు చైర్మన్ నుంచి మంత్రుల స్థాయి వరకు హస్తం ఉంది.కేసీఆర్ కు కవిత కేసుల మీద ఉన్న శ్రద్ధ, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీద లేకపోవడం శోచనీయం. నిరుద్యోగులకు మద్దతుగా నిలిచి, వారి పక్షాన పోరాడుతున్న బిజెపి నేతలు, కార్యకర్తల అరెస్ట్ ను ఖండిస్తూ… వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా.

LEAVE A RESPONSE