Suryaa.co.in

Andhra Pradesh

బాద్యత లేని ముఖ్యమంత్రి రాష్టానికి అవసరమా?

• గోనె సంచుల్లో కమిషన్లు కొట్టేసిన పంది కొక్కులు ఎవరు?
• చినిగిపోయిన గోనె సంచులు ఇస్తారా?
• రైతుల సమస్యలు తీరే వరకు నేను ఇక్కడి నుంచి పోను
– రైతుల దగ్గరకు జగన్ రావాలి….వారి కష్టాలు చూడాలి
• ఈ సైకోలు ఏం చేస్తారు…కేసులు పెడతారు. భయపడతామా ?
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి తొలిరోజు పర్యటన వివరాలు
• ఉంగుటూరు, తాడేపల్లి గూడెం, తణుకు నియోజకవర్గాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ అధినేత
• వర్షాల కారణంగా తమకు జరిగిన నష్టాలను చంద్రబాబు నాయుడుకు వివరించిన రైతులు
• ధాన్యం సేకరణలో జాప్యం, సంచులు ఇవ్వకపోవడం, ఇతర నిబంధనలతో తాము పడుతున్న ఇబ్బందులను చంద్రబాబుకు వివరించిన స్థానిక రైతులు

తొలి రోజు పర్యటన అనంతరం దువ్వలో మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు:-
• అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
• తమ సమస్యలు చెప్పుకున్న రైతులను ప్రభుత్వం బెదిరిస్తుంది.
• కరోనా కాలంలో సైతం పని చేసి దేశానికి అన్నం పెట్టిన రైతును కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది.
• ఉభయ గోదావరి జిల్లాలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం అంతా ఎప్పుడు కొంటారు.
• అకాల వర్షాలపై రైతులను ఎందుకు అప్రమత్తం చెయ్యలేదు
• ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం కావాలి…కానీ అవ్వలేదు.
• రైతులకు ఇచ్చే గోనె సంచులు కూడా ఇవ్వలేదు. చిరిగిపోయిన సంచులు ఇచ్చారు.
• ఒక రైతు తన సొంత డబ్బు రూ.25 వేలు లారీకి చెల్లిస్తే తప్ప ఆయన ధాన్యం మిల్లు స్వీకరించలేదు.
• మిల్లర్లు నూక వస్తుందని రూ.80 నుంచి రూ.140 రూపాయలు రైతు నుంచి తీసుకుంటున్నారు.
• ఒకప్పుడు నచ్చిన విధంగా ధాన్యం తరలించే అవకాశం రైతులకు ఉండేది, నేడు ఆ విధానాన్ని తీసేశారు.
• మిల్లుల దగ్గర వెయిట్ చేయాల్సి వస్తే దానికీ పెనాల్టీ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు
• ప్రభుత్వ విధానాల వల్ల రైతుకు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ. 30 వేలు నష్టపోతున్నాడు.
• తన నియోజకవర్గంలో ఉండే రైతుల గురించి పట్టించుకోని సివిల్ సప్లై మంత్రి ఎందుకు ?• రైతులు కష్టాలకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు…పోరాడుదాం…పోరాడితే పోయేది ఏమీ లేదు.
• నేను పర్యటనకు వస్తాను అని చెప్పి లారీలు తెచ్చి ధాన్యం తరలించే ప్రయత్నం చేశారు.
• నేను వస్తాను అని చెప్పి ఉంటే దువ్వలో కూడా ధాన్యం ముందే తరలించే వారు.
• సిఎం అమరావతిలో కూర్చుని ఏం చేస్తున్నాడు…..రైతుకు ఇంత కష్టం వస్తే ఎందుకు కదలడం లేదు.
• రైతుల దగ్గరకు జగన్ రావాలి….వారి కష్టాలు చూడాలి.
• భోగాపురానికి రెండో సారి ఫౌండేషన్ వేయాల్సిన అవసరం లేదు. ముందు మీరు రైతుల కష్టాలు చూడండి.
• నాడు ప్రజలు ఓట్లు వేసింది మీ అధికారులకు కాదు….మీకు. నాడు ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు.
• బస్తాకు రూ. 1530 రూపాయలు మద్దతు ధర ఇచ్చి తీరాలి.• గోనె సంచులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఏమని చెప్పాలి
• గోనె సంచుల్లో కమిషన్లు కొట్టేసిన పంది కొక్కులు ఎవరు?
• చినిగిపోయిన గోనె సంచులు ఇస్తారా?
• ఈ జిల్లాకు 2 కోట్ల గోనె సంచులు రావాలి. కానీ 20 లక్షల గోనె సంచులు మాత్రమే వచ్చాయి.
• మళ్లీ తుఫాను ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి..రైతుల్ని ఎప్పుడు ఆదుకుంటారు.
• ధాన్యం అమ్మే రైతులకు డబ్బులు ఇవ్వకపోగా…వారినే ఎదురు డబ్బులు కట్టమని అడుతున్నారు.
• రైతులు గళం ఎత్తితే వారిపైనా కేసులు పెడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. నేడు అండగా ఉంటాను.
• రైతుల సమస్యలు తీరే వరకు నేను ఇక్కడి నుంచి పోను.
• కొత్త కొత్త నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. బస్తా ధాన్యానికి మద్దతు ధర గా రూ.1530 ఇవ్వాల్సిందే.
• రైతుల ధాన్యం చివరి బస్తా కొనేవరకు తెలుగు దేశం పార్టీ ఉంటుంది. ప్రభుత్వ మెడలు వంచి అయినా వీరికి న్యాయం చేస్తాం.
• మొక్క జొన్న, పసుపు, వాణిజ్య పంటలకు జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి
• రైతులు తమకు జరిగిన నష్టం వీడియో తీసి మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టండి. మీరు భయపడితే నాకు పెట్టండి.
• ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు,మంత్రులు ఎందుకు తిరగడం లేదు.
• ఈ సైకోలు ఏం చేస్తారు…కేసులు పెడతారు. భయపడతామా ?
• రైతును ఉద్దరించాం అని చెపుతున్న ప్రభుత్వం….ఏం ఉద్దరించిందో చెప్పాలి
• మంత్రి సొంత నియోజకవర్గంలో గోనె సంచుల కోసం రైతుల ఆందోళన చేయటం సిగ్గుచేటు, దీనికి ఏం సమాధానం చెపుతారు?
• రైతుల్లో ఎంతో బాధ ఆవేదన ఉంది. ఇంత సమస్య ఉన్నా సిఎం కనీసం ఒక్క ప్రకటన చేయరు.
• ఈ ప్రభుత్వాన్ని దోషులుగా ప్రజా కోర్టులో నిలబెడదాం.

అంతకు మందు తాడేపల్లి గూడెం నందమూరులో శ్మశానంలో ఆరబోసిన ధాన్యాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించారు
• అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….
• రైతులు స్మశానం లో ధాన్యం ఆరబెట్టుకోవటం జగన్ రెడ్డి చేతకాని పాలనకు నిదర్శనం
• అకాల వరదల కారణంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 70 శాతం ధాన్యం ఇంకా పొలాల్లో ఉంది.
• అసమర్ద సీఎం వల్ల నిండా మునిగిపోయామని రైతులు వాపోతున్నారు.• జగన్ రెడ్డి అసమర్ద పాలనతో రైతుల జీవితాల్ని నాశనం చేస్తున్నారు.
• ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల కష్టాన్ని రైస్ మిల్లర్లు, దళారులు తోచుకుంటున్నారు. తరుగు, తేమ అంటూ డబ్బుల్లో కోత కోస్తున్నారు.
• ఎకరాకు 60 బస్తాలు పండుతాయి, కానీ కేవలం 53 బస్తాలే కొంటారంటున్నారు, మరి మిగిలిన దాన్యం ఎవరు కొనాలి?
• నేను వస్తున్నాని తెలిసి ఇప్పుడు హడావుడి అధికారులు దాన్యం కొనుగోలు అంటూ డ్రామాలాడుతున్నారు. మరి మిగతా గ్రామాల్లో ధాన్యం పరిస్ధితి ఏంటి?
• ఏప్రిల్ మెదటి వారంలోనే దాన్యం సేకరణ చేసి ఉంటే ఈ పరిస్ధితి ఉండేదా?
• వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం ఎందుకు రావట్లేదు? రైతులు కష్టాల్లో ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?
• బాద్యత లేని ముఖ్యమంత్రి రాష్టానికి అవసరమా?
• జగన్ ని పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్ధానంలో ఉన్నాం, జగన్ ని నమ్ముకున్నందుకు రైతులు మరణం శాసనం రాసుకుంటున్నారు.
• సీఎం వచ్చి రైతులను పరామర్శించాలి, ధాన్యం ఎప్పటిలోగా కొనుగోలు చేస్తారో నిర్టిష్టమైన సమాధానం చెప్పాలి.
• ప్రతి రైతుకు న్యాయం జరిగేవరకు టీడీపీ అండగా ఉంటుంది

LEAVE A RESPONSE