Suryaa.co.in

Andhra Pradesh

రాజా రెడ్డి రాజ్యాంగంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా జగన్ రెడ్డి గారు?

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన బాధితుడిని
బూతులు తిడుతూ భౌతిక దాడి చెయ్యడాన్ని రాజా రెడ్డి రాజ్యాంగంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా జగన్ రెడ్డి గారు? హిందూపూర్ నియోజకవర్గం చిలమత్తుర్ మండలం సంజీవరాయనపల్లి గ్రామంలో దివ్యాంగురాలు పద్మావతి కి పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని కొడుకు

వేణు ప్రశ్నిస్తే స్థానిక వైసీపీ నేత దామోదర్ రెడ్డి దాడి చేసాడు. జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళితే అక్కడ ఎస్ఐ ఘోరంగా అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ దాడి చెయ్యడం దారుణం. వేణు పై దాడి చేసిన వైసిపి నేతలు, ఎస్ఐ పై తక్షణమే చర్యలు తీసుకొని దివ్యాంగురాలైన తల్లి పద్మావతి కి పెన్షన్ ఇవ్వాలి.

LEAVE A RESPONSE