సంస్కృతానికి లిపి లేదా?

ప్రముఖ సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘అష్టాధ్యాయి’. దీన్ని రాసినవారు పాణిని. ఈ పాణిని తన అష్టాధ్యాయిలో తన కాలానికి తనకు తెలిసిన సంస్కృత వ్యాకరణ గ్రంథాల ప్రస్తావన చేశాడు.
పాణిని కాలం సామాన్య శకానికి పూర్వం 4వ శతాబ్ది అని కొందరు చెబుతారు. Theodor Gold Stucker పాణిని కాలం సామాన్య శకానికి పూర్వం 8వ శతాబ్ది అని నిరూపించారు. దీన్ని బట్టి పాణిని 2,700యేళ్ల నాటి వారు.
పాణినిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా 2,700యేళ్ల క్రితమే సంస్కృత భాషకు వ్యాకరణం ఉంది అన్నది ‘తెలివిడి’. లిపి లేని భాషకు వ్యాకరణం ఉండదు కదా? పాణిని ఒక వ్యాకరణ గ్రంథం రాశాడంటే ఆయన ఒక లిపిలోనే రాసి ఉంటాడు కదా?
సంస్కృత భాషకు సామాన్య శకం 9వ శతాబ్ది వరకూ లిపి లేదని చెప్పడం అజ్ఞానం. చదువు, అవగాహన లేనివాళ్లు, బుద్ధి లేనివాళ్లు, విద్వేష వాదులు, విధ్వంసక శక్తులు సనాతనంపై చేస్తున్న దాడిలో భాగంగా సంస్కృతం భాషకు సామాన్య శకం 9వ శతాబ్ది వరకూ లిపి లేదని పేలాపన చేస్తున్నారు.
సంస్కృతానికి ‘భాష’ అన్న ఒక పేరు ఉండేది. ఒక దశలో సంస్కృతానికి సరస్వతి లిపి ఉండేది. అటు తరువాత బ్రాహ్మీ, నాగరి (దేవ నాగరి కాదు), దక్షిణ్, ని, మంగల్, పరుష, యవ, తీర్థి, ఉక్, దారద్, శిఖ్యాని, మన, మధ్యా, చార, నంది నాగరి, శారదా, సిద్ధమ్ వంటి ఇతర లిపులలో సంస్కృతం రాయబడేది. సిద్ధమ్ లిపిలో ఉన్న సంస్కృతం మూలంగానే బౌద్ధం చైనాకు చేరి ఆపై విశ్వవ్యాప్తం అయింది. బౌద్ధం పాలీ వల్ల వ్యాప్తి పొందలేదు. (ఈ విషయంపై నా క్రితం వ్యాసాల్లో వివరణ ఇచ్చాను) అసలు పాలీ బుద్ధుడి భాష కానేకాదు.
జీవ నదులు ఉన్నాయన్న సంగతి తెలియక, సరైన చదువు, తెలివి, తెలివిడి లేక, జీవ నదుల్లో ఈద లేక అసలు నదే లేదని చెప్పడం బుద్ధి మాంద్యం, మూర్ఖత్వం ఆపై చెడ్డతనం. మనం చదువుతో అవగాహనకు వద్దాం. చదువు, మెదడు, సిగ్గు లేకుండా సంస్కృతం గురించి పేలాపనలు చేస్తున్న మానసిక రోగులను, విద్వేషవాదుల్ని తరిమి తరిమి కొడదాం.
- రోచిష్మాన్
9444012279
