Suryaa.co.in

Andhra Pradesh

పాదయాత్ర పేరుతో రైతులు రాజకీయ యాత్ర

– పాదయాత్ర వెనుక టీడీపీ
– మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

గుంటూరు: పాదయాత్ర పేరుతో రైతులు రాజకీయ యాత్ర చేస్తున్నారు.పాదయాత్రను టీడీపీ వెనుక ఉండి నడిపిస్తుంది.ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసి అభివృద్ధి చేస్తే రాజదాని ప్రాంత సంతోషంగా ఉంటుంది కానీ అది జరగనివ్వడం లేదు.రాజధాని ఇష్యూ లేకపోతే టీడీపీ ఉనికి ఉండదు. మెజారిటీ రాజదాని ప్రజలు అభివృద్ధి చేయమంటున్నరు.టీడీపీ ట్రాప్ లో కొన్ని పార్టీలు ఉన్నాయి. టీడీపీ కోసం రైతులు నష్టపోతున్నారు.రాజధాని అంశం ముగిస్తే టీడీపీ ఉనికి ముగుస్తుంది.సీఎం జగన్ కంటే రైతులకు మేలు చేసే వారు ఉండరు.టీడీపీ ట్రాప్ లో నుండి రైతులు బయటకు రావాలి. రైతులు రాజకీయ అంశాలు మాట్లాడుతున్నారు. రైతులు ఆలోచించి చర్చలకు రావాలి. లేకుంటే వారికే నష్టం జరుగుతుంది. రైతులు చర్చలకు వస్తె వారికి ఉపయోగం కలిగేలా సీఎం నిర్ణయం చేస్తారు.

LEAVE A RESPONSE