– మంత్రి లోకేష్‌కు అందజేసిన దాతలు
ఉండవల్లి: వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. కేరళకు చెందిన పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్స్ థామస్ రూ.50 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శశి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు బి.వేణుగోపాల కృష్ణ రూ.25 లక్షలు, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నేతృత్వంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, నాయకులు కలిపి రూ.3,36,000 విరాళాన్ని అందించారు. దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.