Suryaa.co.in

Andhra Pradesh

దళిత వ్యతిరేకి జగన్ ను నమ్మొద్దు

– వెలిగొండ సభలో దళిత నాయకులను వేదిక పై నుంచి సీఎం దించేయడం నేరం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

వెలిగొండ సభలో దళిత నాయకులను జగన్ వేదికపై నుండి దించేయడం నేరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడిన మాటలు ..

జగన్ దళిత వ్యతిరేకి
జగన్ దళిత వ్యతిరేకి. తన పక్కన దళితులు కూర్చుంటే ఆయనకు గిట్టదు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెలిగొండ సభలో వైసీపీ ఇన్ ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్, మంత్రి ఆదిమూలపు సురేష్ ల ను డయాస్ నుండి కిందికి పంపేశారు. ఆ స్థానాల్లో తన వర్గీయులైన వైవీ సుబ్బారెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలను కూర్చోబెట్టారు.

జగన్ పక్కన దళితులు కూర్చోవడం ఇష్టంలేకనే లేపి కిందికి పంపారు. గతంలో డిప్యూటీ సీఎం పినిపే విశ్వరూప్ ని సభలో మోకాళ్లపై కూర్చోబెట్టారు. మరో సభలో అందరూ కుర్చీలలో కూర్చిన ఉండగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి అందరికన్నా వెనుక చేతులు కట్టుకొని నిల్చొనేలా చేశారు. దళితులను వేదిక దిగి పొండని ముఖ్యమంత్రి అనటం చట్ట రిత్యా నేరం.

వెలిగొండ సభ వేదిక పై నుండి దళిత నాయకులను దించేయడంపై కేసు నమోదు చేయాలి
నేషనల్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు రిజిష్టర్ చేయాలి. ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి నడిరోడ్డుపై తిరుగుతూ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. వెలిగొండ సభలో వైసీపీ తరపున పోటీ చేయబోయే వ్యక్తికి సీఎం ఇచ్చే గౌరవం ఇదేనా? సీఎం పక్కన ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ను కూడా అవమానపరచి మీరు కిందికి వెళ్లిపోండి.. అని పంపించేయడం ఎంతవరకు సబబు? జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైవీ సుబ్బారెడ్డి లను ఆ స్థానాల్లో కూర్చోబెట్టడం న్యాయమా?. డయాస్ నుండి దిగిపోమనడం నేరం.

జగన్ కు దళితులంటే అస్సలు పడదు
జగన్ కు రాష్ట్రంలోని దళితులంటే అస్సలు పడదు. జగన్ దళిత వ్యతిరేకి. దళితులు వద్దు గానీ దళితుల ఓట్లు మాత్రం జగన్ కు కావాలి. దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి దళితులను అడుగడుగునా ఇబ్బందులపాలు చేస్తున్నాడు. ఇంతగా దళితులను ఈసడించుకుంటున్నా దళితుల్లో చైతన్యం కొరవడింది. దళితులంటే జగన్ కు ఎందుకింత వ్యతిరేకత, అసూయ, ఈసడింపు? ఇంతగా ఈసడించుకుంటున్నా, అవమానాలపాలు చేసినా జీ హుజూర్ అని వైసీపీ దళిత నాయకులున్నారు. దళితులకు కూడా గౌరవమివ్వాలనే ఆలోచన జగన్ కు ఏకోశాన లేదు. ఈ సంఘటన పట్ల ఎస్సీ ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేయాలి. ఈ సంఘటన పట్ల జగన్ దళితులకు సమాధానం చెప్పాలి.

దళిత వ్యతిరేకి జగన్ ను నమ్మొద్దు
దళిత వ్యతిరేకి అయిన జగన్ ను ప్రజలు నమ్మద్దు. ముఖ్యమంత్రిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి దళితులపై జరిగే దాడులనుపై సమీక్షించాల్సు ఉంది, కాని, ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా సమీక్షించిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి ప్రభుత్వానికి నైతిక విలువలు లేవని తెలుస్తోంది.

రెడ్లను అందలమెక్కించడం జగన్ వ్యవహారశైలి
వైవీ సుబ్బారెడ్డి ఒక ఆర్గనైజింగ్ కి ఆఫ్ట్రాల్ ఛైర్మన్, పెద్దిరెడ్డి మామూలు మంత్రి. మన దళితుడు ఎస్సీ మాల వర్గానికి చెందిన నారాయణ స్వామి హోదా డిప్యూటీ సీఎం అటువంటప్పుడు డిప్యూటీ సీఎంకు ఎక్కువ విలువ ఇవ్వాలి. వెలిగొండ సభలో జగన్ కు దళితుల పట్ల ఉన్న అభిప్రాయం కొట్టొచ్చినట్లు కనబడింది. నారాయణస్వామి వయసులో పెద్దవాడైనా కించపరిచే రీతిలో ఆయనను నిలబెట్టించారు. మామూలు మంత్రిని, ఛైర్మన్ ని కూర్చోబెట్టారు. ఆయనకు నైతిక విలువలుంటే వేదికలో కుర్చీ లేనప్పుడు నీ కేబినెట్ లో ఎందుకని రాజీనామా చేయాల్సింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ సోనీఉడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు
దళితుడిగా బాధపడుతున్నానని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ సోనీఉడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కమిషన్ మెంబర్ గా ఎందుకన్నా ఉన్నానని బాధ వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రభుత్వంలో చలనం లేదు.

ప్రభుత్వం దళితుల పట్ల బరితెగించి వ్యవహరిస్తోంది
దళితులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిని చేసి చంపేశారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటే వరప్రసాద్ అనే దళితుడిని పోలీసు స్టేషన్ లో శిరోముండనం చేశారు. నలుగురు వైసీపీ సింపథీసర్స్ దళిత మహిళపై అత్యాచారం చేశారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ అనే దళితుడిని కొట్టి చంపారు.

మద్యం కిక్కెట్లేదు, నాసిరకం మద్యం అమ్ముతున్నందుకు ఓంప్రకాశ్ ని చంపారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో లక్ష్మీ అనే దళిత మహిళను అత్యాచారం చేసి చంపారు. వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నను బెల్ కొట్టినా అగ్ర కులానికి చెందిన వ్యక్తి రాలేదని ప్రశ్నిస్తే చంపేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తన ఆవేదనను వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE