-ఉద్యోగుల పోరాటన్ని తాకట్టు పెట్టిన సంఘాలు
-జిపియస్ వస్తుందే తప్ప ఓపియస్ రాదని చెప్పగలరా?
– మాజీ మంత్రి కె.ఎస్. జవహార్
ఉద్యోగులను ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘ నాయకులు సైతం మోసం చేస్తున్నారు. జగన్ రెడ్డి ఇచ్చే తాయిళాలకు లొంగిపోయి ఉద్యోగులు చేస్తున్న పోరాటాన్ని ఉద్యోగ సంఘాలు నీరుగార్చుతున్నారు. సీపీఎస్ వారంలో రద్దు చేస్తానంటే రెండు చేతులతో ఓట్లు వేశారు. రద్దేలేదంటే రెండు చేతులతో భజన చేయటం ఏ పోరాటమో ఉద్యోగ సంఘాలు చెప్పాలి?
ఉద్యమం చేస్తున్న ఉద్యోగులపై జగన్ రెడ్డి దాడులు చేయించినప్పుడు ఎందుకు సంఘాలు మౌనంగా ఉండిపోయాయి? ఉద్యోగులను, ఉద్యోగుల పోరాటాన్ని తాకట్టు పెట్టి వ్యక్తిగత ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. ఉద్యోగులు పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్న వరకు ఉపాధ్యాయులు నేడు పోలీసుల వంతైంది. ప్రతిపక్ష నాయకులను విమర్శలు చేయడానికేనా పోలీస్ ఉద్యోగ సంఘం పని చేస్తుంది. పని ఒత్తిడితో సాటి ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే మీకు పట్టవా?
సమస్యలు చర్చిస్తేనే సంబరపడుతుంటే పరిష్కారం లేనట్లుగా భావించాలి. ఉద్యమాన్ని ఊడిగం చేపిస్తున్నారు. ప్రభుత్వం మోసం చేసింది, నాయకులు ప్రభుత్వ పంచన చేరారు. హక్కులు బాధ్యతలు రెండు ఉద్యోగులే చేయాలి. 43% ఫిట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు ద్వారానే సమస్యల పరిష్కారం. జీతాలు ఎపుడు అందుతాయో తెలియని ప్రభుత్వ నైజం ఎండగట్టాలి.
ఇంటి అద్దె అలవన్స్ తగ్గిస్తే మాట్లాడలేని పరిస్థితి. పిఅర్సీ రిపోర్ట్ చూడని పరిస్థితి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఆప్షన్ ఇవ్వకుండానే ఫే ఫిక్సేషన్. ఇవ్వన్నీ ఎవరి వైఫల్యాలో చెప్పాలి.
ఉద్యోగుల పక్షాన నిలిచిన ఉద్యోగ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం ద్రోహం. న్యాయపరమైన డిమాండ్లు అమలు చేయకుండా పని ఒత్తిడి పెంచి ఉద్యోగులను మానసిక వేదింపులకు గురి చేస్తున్నారు.