Suryaa.co.in

Andhra Pradesh

అధైర్యపడవద్దు..నేనున్నా!

మాజీ సీఎం , వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

పులివెందుల: పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయిన మాజీ సీఎం వైఎస్‌ జగన్, అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు.

LEAVE A RESPONSE