– బీజేపీ బద్నాం చేస్తామంటూ ఊరుకోము
10శాతం ముస్లిం మైనార్టీలకు ఇస్తామనడం బీసీలను మోసం చేయడం కాదా?
– కాంగ్రెస్ బీసీ ధర్నాపై ఢిల్లీలో బుధవారం ఎంపీ డీకే.అరుణ ఫైర్
ఢిల్లీ: డ్రామాలొద్దు.. దమ్ముంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి. మీకు చిత్తశుద్ది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. బీజేపీ బద్నాం చేస్తామంటూ ఊరుకోము
చిత్తశుద్ది ఉంటే.. ఇచ్చిన మాట ప్రకారం 42శాతం రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వండి. ఇందులో 10శాతం ముస్లిం మైనార్టీలకు ఇస్తామనడం బీసీలను మోసం చేయడం కాదా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తోంది. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ.. కాంగ్రెస్ ఇలాంటివి కామనే.ఢిల్లీలో ఇవాళ్టి కాంగ్రెస్ బీసీ ధర్నా అందులో భాగమే
ముందునుంచీ వ్యతిరేకమే కదా?
కాంగ్రెస్ ఎప్పట్నుంచో బీసీలకు వ్యతిరేకమే. బీసీలను ఓటు బ్యాంకుల రాజకీయంగా వాడుకున్న కాంగ్రెస్ కాదా? ఎన్నికలొచ్చినప్పుడల్లా బీసీ రాగం ఎత్తుకోవడం వీళ్లకు అలవాటే. మీకు దమ్ముంటే ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ను అమలు చేయండి. అంతేగాని ఓట్ల కోసం ఢిల్లీలో ధర్నాలు చేస్తాం, బీజేపీ బద్నాం చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది. ఆ భయంతోనే బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. మీకు చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లలో 10శాతం ముస్లిం మైనార్టీలకు అంటే మీరు బీసీలను మోసం చేసినట్లు కాదా? దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ చేతగాని తనాన్ని బీజేపీపై నెట్టి బద్నాం చేస్తామంటూ సహించేది లేదు.