-ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించండి
– తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి
కోఠీలో ఉన్న ఆరోగ్య విభాగం వద్ద ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వారికి ప్రతి నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఆశా వర్కర్లకు న్యాయం చేస్తామని ఆశా వర్కర్ల అధికారి పద్మజ ధర్నా వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించడం జరిగింది. జాయింట్ డైరక్టర్ పద్మజ కు బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి వినతి పత్రం సమర్పిస్తున్న దృశ్యం.