సికింద్రాబాద్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సోమవారం అడ్డగుట్ట మునిసిపల్ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేత తీగుల్ల కిరణ్ గౌడ్, ఇతర నేతలు, అధికారులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పధకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఆడ పిల్లల పెళ్ళిళ్ళు శాపం గా భావించ కుండా ప్రభుత్వం ఆసరా కల్పిస్తోందని అన్నారు. రూ.36 లక్షల మేరకు విలువ చేసే ౩౩ కళ్యాణ లక్ష్మి, ఐదు సీ ఏం ఆర్ యఫ్ చెక్కులను ఈ సందర్భంగా లబ్దిదారులకు అందించారు. నార్త్ లాలాగుడా, శేషా పహాడ్, శాంతీ నగర్, తుకారం గేట్, గడ్డ మేది బస్తే, సాయి నగర్, వడ్డెర బస్తి, మంగరోడి బస్తీ, ఆజాద్ చంద్ర శేఖర్ నగర్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పర్యటించారు.
ఆజాద్ చంద్ర శేఖర్ నగర్ లో రూ.8.50 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న సివరేజ్ లైన్ నిర్మాణం పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో బీ ఆర్ ఎస్ జండాలను స్థానిక బీ ఆర్ ఎస్ నేతలు, తెలంగాణా ఉద్యమ కారులతో కలిసి ఆవిష్కరించారు.