– బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
కేసీఆర్ ఆటలు ఇక సాగవని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కోవా లక్ష్మణ్ హెచ్చరించారు. నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన లక్ష్మణ్, టీఆర్‌ఎస్ అరాచకాలకు చరమగీతం పాడే సమయం వచ్చిందని హెచ్చరించారు. త్వరలో తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు రానున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ ఏమన్నారంటే…
ఈ ధర్మ యుద్దంలో న్యాయం గెలిచింది. చెంప పెట్టులాంటి తీర్పు హైకోర్టు ఇఛ్చింది. మీరు ఇచ్చిన ఉత్తర్వులు తప్పని తేల్చి చెబితే ఈ రోజు బండి సంజయ్ జైలు నుండి బయటకు వచ్చారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల పక్షాన 317 జీవోను సవరించేదాకా ప్రజా క్షేత్రంలో పోరాటం కొనసాగించి తీరుతాం.
తెలంగాణలో ప్రజలంతా బీజేపీకి అండగా ఉండాలని కోరుకుంటున్నా. న్యాయం జరిగే వరకు తుది వరకు కొట్లాడతాం.తెలంగాణలో కుటుంబ-అవినీతి-నియంత పాలనను పారద్రోలే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం.ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని చెప్పేందుకే ఈ సభ.అరచేతితో సూర్యుడిని ఆపలేరు.. మీ అరెస్టులు, లాఠీ ఛార్జీలతో బీజేపీ కార్యకర్తలు అదిరేది లేదు. బెదిరేది లేదు. బండి సంజయ్ నాయకత్వం తెలంగాణ శాఖ చేపడుతున్న పోరాటానికి జాతీయ నాయకత్వం పూర్తిగా అండగా ఉంది.
టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిన తీరుపై జేపీ నడ్డా ఖండించడమే కాకుండా నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, చత్తీస్ ఘడ్ మాజీ డాక్టర్ రమణ సింగ్ సైతం కరీంనగర్ వెళ్లి బండి సంజయ్ తోపాటు బీజేపీ కార్యకర్తలను కలిసి భరోసా కల్పించారు.
రేపు అసోం సీఎం హేమంత్ బిశ్వా శర్మ రాబోతున్నరు. ప్రభుత్వం దిగొచ్చి 317 జీవోను సవరించేదాకా పోరాడి తీరుతాం. ఈనెల 11న మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ రాష్ట్రానికి రాబోతున్నరు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు జాతీయ నాయకత్వం రాబోతోంది. ప్రజలకు అండగా ఉండేందుకు మేం చేసే పోరాటాల్లో పాల్గనబోతోంది.
మంత్రి కేటీఆర్ ప్రధానిపైనా, జేపీ నడ్డాపై వాడిన భాష సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక 45 వేల కోట్ల ఖర్చు పెట్టి అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పంజాబ్ కు వెళితే ప్రధానిపై కేటీఆర్ చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయం చేయడం సిగ్గు చేటు.