Suryaa.co.in

Telangana

భారత జాగృతి ఇస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ సాహిత్య పురస్కారానికి డాక్టర్ ఎన్ గోపి ఎంపిక

– జూన్ 21 ఉదయం అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగే కార్యక్రమంలో భారత జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత, ఇతర పెద్దల చేతుల మీదుగా అవార్డు ప్రదానం

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారానికి ఆచార్య ఎన్ గోపి ఎంపికయ్యారు. సాహిత్యం లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సాహితీ మూర్తులకు భారత జాగృతి ఈ అవార్డు ఇవ్వనుంది. అవార్డు ఈ సంవత్సరం మొదలవగా తొలి అవార్డును ఎన్ గోపి అందుకో నుండడం విశేషం.

ఆచార్య గోపి ఇప్పటికీ 56 పుస్తకాలు రచించగా అందులో 26 కవితా సంకలనాలు, 7 వ్యాస సంకలనాలు, 5 అనువాదాలు కాగా మిగతావి ఇతరాలు ఉన్నాయి. వారి రచనలు అన్ని భారతీయ భాషలలోకి అనువాదం అవడంతో పాటు జర్మన్, పర్షియన్, రష్యన్ వంటి భాషలలోకి అనువాదం అయ్యాయి. వీరు తెలుగు యూనివర్సిటీకి వీసీగా వ్యవహరించడంతో పాటు కాకతీయ, ద్రవిడ యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీ గా చేశారు.

జూన్ 21 ఉదయం అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగే కార్యక్రమంలో భారత జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత, ఇతర పెద్దల చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయనున్నారు.

LEAVE A RESPONSE